Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమాకి గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చాడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు పొందటంతో పాటు.. ‘నాటు నాటు’ పాటకిగాను ఆస్కార్ కూడా గెలుచుకుంది. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చింది.
Salaar : బోర్లా పడ్డ సలార్.. ప్రశాంత్ నీల్ దెబ్బేసేసాడు భయ్యా..!
ఈ సినిమా వల్లే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లిస్ట్‌లో స్థానం సంపాదించి ఎన్టీఆర్, చరణ్ అరుదైన గౌరవం పొందారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మరో అరుదైన ఘనతను సాధించాడు. ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ.. “గ్లోబల్ మీడియాలో 500 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు” పేరుతో ఒక లిస్టును విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఎన్టీఆర్ స్థానం సంపాదించుకున్నాడు. సౌత్ నుంచి ఈ లిస్టులో స్థానం సంపాదించిన మొదటి హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. మిగతా తెలుగు స్టార్స్‌తో పోలిస్తే స్పీడ్‌గా సినిమాలు చేస్తాడనే పేరున్న ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సమయంలో మాత్రం వేరే చిత్రాల్లో నటించకుండా, కొన్నేళ్లపాటు పూర్తిగా ఆ సినిమాకే అంకితమైపోయాడు. దీంతో ఆయన అభిమానులు ఎంతో నిరాశచెందారు.
అయితే ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం, ఆ తర్వాత ఆస్కార్ నామినేషన్స్ అంచుల వరకు వెళ్ళడం, ఇప్పడు వెరైటీ గ్లోబల్ లిస్టులో చోటు సంపాదించడంతో.. ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.