Jr NTR: జపాన్‌ సునామీలో చిక్కుకున్న ఎన్టీఆర్‌..! ఆందోళనలో ఫ్యాన్స్..

దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్‌.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భార్య ప్రణతి, కుమారులు అభయ్‌, భార్గవ్‌తో కలిసి జపాన్‌కు వెకేషన్‌కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఐతే జపాన్‌లో పరిస్థితి భయానకంగా ఉంది.

  • Written By:
  • Publish Date - January 1, 2024 / 07:20 PM IST

Jr NTR: కొత్త ఏడాది ప్రపంచం అంతా ఆనందంలో మునిగితేలితే.. ద్వీప దేశం జపాన్‌ మాత్రం భూకంపాలతో వణికిపోయింది. జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. చాలా వరకు భూమి కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సునామీ, భూకంపం భయంతో చాలా మంది ఇండ్లు వదిలేసి రోడ్లపైనే ఉంటున్నారు. అయితే, ప్రస్తుతం ఈ అంశం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను కంగారు పెడుతోంది. కారణం.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌.. ఫ్యామిలీతో కలిసి జపాన్‌ ట్రిప్పులో ఉన్నారు. దీంతో ఆయన అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు.

Devara: దండయాత్ర.. దేవర’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

తారక్‌ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా చూసుకుంటాడు. ఏ మాత్రం ఖాళీ దొరికిన చాలు.. ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే చేశారు. దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్‌.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భార్య ప్రణతి, కుమారులు అభయ్‌, భార్గవ్‌తో కలిసి జపాన్‌కు వెకేషన్‌కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఐతే జపాన్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. వరుస భూకంపాలు స్థానికులను.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేస్తున్నాయ్. జపాన్‌ నార్త్ సెంట్రల్‌లో మొదలైన ప్రకంపనలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయ్. భూకంపం ప్రభావంతో.. ఆస్తి, ప్రాణనష్టం భారీగా జరిగిందన్న అంచనాలు వినిపిస్తున్నాయ్. ఇక సునామీ కూడా ముంచుకొచ్చే ప్రమాదం ఉందని.. స్థానిక అధికారులు హెచ్చరిస్తున్న వేళ.. ఎన్టీఆర్‌ ఫ్యామిలీ గురించి అభిమానులు, కుటుంబసభ్యులు కంగారు పడిపోతున్నారు. భూకంప తీవ్రత 7.5గా నమోదు కావటంతో.. గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు జపాన్ జనాలు. గతంలోనూ సునామీలు విరుచుకుపడినప్పుడు 7.5 తీవ్రతతలోనే భూకంపాలు వచ్చాయ్. దీంతో జపాన్ వణికిపోతుంది. అలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఉన్నారన్న ఆలోచనే.. ఆయన అభిమానులను వెంటాడుతోంది. భూ కంపంతోపాటు, సునామీ వస్తే టోక్యో నగరంలోకి భారీగా నీరు వస్తుంది.

ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్‌ విహారయాత్రలో ఉన్నారు. దీంతో అభిమానుల్లో టెన్షన్ మరింత రెట్టింపు అయింది. ఆయన క్షేమంగా కుటుంబంతో కలిసి ఇండియాకు రావాలని.. అభిమానులు వేడుకుంటున్నారు. నీగాటా, టొయామా, యమగటా, ఫుకుమా, హ్యోగో, ప్రిఫెక్చర్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు ఇవ్వటంతోపాటు.. తీర ప్రాంత జనాలను అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అలలు 5 మీటర్ల కంటే ఎత్తులో ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని.. జనాలందరూ సముద్రం నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది. ఇక అటు టోక్యోలోని భారత రాయబార కార్యాలయం… ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలతో ఒక ప్రకటన విడుదల చేసింది. భూకంపం, సునామీకి సంబంధించిన సమాచారం కోసం ఎవరైనా కాంటాక్ట్‌ అవ్వొచ్చని తెలిపింది.