Jr.ntr: వాడు సంద్రంలో పుట్టిన సైతాన్‌..యోధుడి గెటప్‌లో ఎన్టీఆర్‌..గూస్‌బంప్స్‌ లుక్‌

ఎన్టీఆర్‌ 30 సినిమాను అలా లాంచ్‌ చేశారో లేదో ఇలా వరుస డైలాగ్‌లతో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు మూవీ మేకర్స్‌. ముహూర్తం రోజునే స్టోరీ లైన్‌ చెప్పేశాడు డైరెక్టర్‌ కొరటాల శివ. ఏ కాన్సెప్ట్‌తో సినిమా తీయబోతున్నాడో.. స్కీన్‌ప్లే ఎలా ఉండబోతోందో పూసగుచ్చినట్టు చెప్పి హైప్‌ క్రియేట్‌ చేశాడు.

  • Written By:
  • Publish Date - March 25, 2023 / 06:00 PM IST

ఈ సినిమాలో మనుషులకంటే మృగాలే ఎక్కువ కనిపిస్తాయని.. ఆ మృగాలన్నీ భయపడేది ఒక్కరికే అంటూ హీరో క్యారెక్టర్‌ సినిమాలో ఏ రేంజ్‌లో ఉండబోతోందో చెప్పాడు. ఇప్పుడు అలాంటిదే మరో డైలాగ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు మూవీ యూనిట్‌. యువసుధ ఆర్ట్స్‌ ట్విటర్‌ పేజ్‌లో ఈ డైలాగ్‌ను పోస్ట్‌ చేశారు. “సంద్రంలో వేటకెళ్లడం మాకు అలవాటు.. సముద్రపు అలలు ఏనాడు మమ్మల్ని బయపెట్టలేదు. కానీ ఆరోజు సంద్రం రక్తాన్ని అలలా మార్చుకుంది. ఆ మృగాలకు వాడు సంద్రంలో పుట్టిన సైతాన్‌లా కనిపించాడు” అంటూ స్టన్నింగ్‌ డైలాగ్‌ రాశారు.

ఎన్టీఆర్‌ యోధుడి గెటప్‌లో సుముద్రం ఒడ్డున నిలబడి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ఇది ఫ్యాన్‌మేడ్‌ పోస్టరా ఆఫిషియల్‌ పోస్టరా అనే విషయం పక్కన పెడితే.. ఈ స్టిల్‌కు మాత్రం ఓ దుమ్ములేచిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. మొదటి నుంచీ ప్రతీ అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారు మూవీ యూనిట్‌. గతంలో ఎన్నడూ చూడని భీకరమైన ఫైటింగ్‌ సీన్స్‌ ఈ సినిమాలో ఉండబోతున్నాయని కొరటాల ఇంతకు ముందే చెప్పాడు. దానికి తగ్గట్టుగానే రివీల్‌ చేసిన ప్రతీ ఫొటోలో ఎన్టీఆర్‌ వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. చేతిలో కత్తితో.. పుట్టిందే పోరాడటానికి అన్న రేంజ్‌లో తారక్‌ లుక్స్‌ ఉన్నాయి. దీనికి తోడు రోమాలు నిక్కపొడిచే నరేషన్‌తో డైలాగ్స్‌ వినిపిస్తున్నారు. ఈ రేంజ్‌లో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్న ఎన్టీఆర్‌30 రిలీజ్‌ అయ్యాక ఎలాంటి రికార్డ్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.