అయితే ఇప్పుడు రామ్ పేరు చెప్పి హాలీవుడ్ మూవీని ఇక్కడ మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు హాలీవుడ్ డైరెక్టర్. ది గార్డియన్ ఆఫ్ ద గెలాక్సీ కొత్త వర్షన్ రిలీజ్ అవుతుంటే, మనదేశంలో ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు ఇక్కడ పాపులర్ అయిన త్రిబుల్ ఆర్ ని, ఆ సినిమా స్టార్ అయిన తారక్ పేరుని వాడేసుకున్నాడు జేమ్స్ గన్.. అంతా చెర్రనీ, తారక్ ని సూపర్ హీరోలుగా చూడాలనుందంటారే కాని, ఇంతవరకు హీలీవుడ్ నుంచి సాలిడ్ ఆఫర్ ఏదీ రాలేదు. అందుకే ఇండియన్స్ కి బాగా దగ్గరైన త్రిబుల్ ఆర్ స్టార్స్ పేరు వాడి, ఏదోలా ఇండియన్స్ అటెన్షన్ హాలీవుడ్ మూవీ ది గార్డియన్ ఆఫ్ ద గెలాక్సీ మీద పడేలా చేస్తున్నాడు ఈ దర్శకుడు.
ఓ హాలీవుడ్ దర్శకుడు తన మూవీ ప్రమోషన్ కోసం తెలుగు హీరోల పేరు వాడతాడా అంటే, మార్కెటింగ్ లో ఏ అవకాశాన్ని వదలకూడదనేది బేసిక్ ప్రిన్సిపుల్. అంతెందుకు రాజమౌళికంటే ముందే చరిత్ర సృష్టించిన మణిరత్నమే, పొన్నియన్ సెల్వం సీరీస్ ని ఇక్కడ ప్రమోట్ చేసేందుకు రాజమౌళిని పొగడ్తల్లో ముంచెత్తాడు.. సరే జక్కన్న, ఎన్టీఆర్ ఇలా ఎవరిని ఎవరు పొగిడినా, ఆ కాంప్లిమెంట్స్ కి వీళ్లు అర్జులే.. కాకపోతే పని కట్టుకుని పొగిడేవాళ్ల పొగడ్తల వెనకున్న మర్మమే మెల్లిగా తెలుస్తోంది.