Jr NTR: ఎన్టీఆర్ అందరివాడా..? కొందరివాడా..?

ఆల్రెడీ జాన్వీ కపూర్‌తో కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు తారక్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో తారక్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కనిపించబోతోంది. శ్రద్ధ గతంలో తెలుగులో ప్రభాస్‌తో సాహో మూవీలో నటించిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - May 11, 2023 / 04:58 PM IST

Jr NTR: ఎన్టీఆర్ అందరివాడా అంటే కాదు కొందరి వాడే అనుకోవాల్సి వస్తోంది. అదే నిజమని తేలుతోంది. కారణం తన ఇమేజ్, పెరిగిన మార్కెట్. త్రిబుల్ఆర్ సక్సెస్ తర్వాత తారక్ లెక్కలు మారాయి. తనతో జోడీ కట్టాలంటే లోకల్ హీరోయిన్స్ చాలదు, బాలీవుడ్ బ్యాచ్ దిగాల్సిందే అంటున్నాడట. ఆల్రెడీ జాన్వీ కపూర్‌తో కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు తారక్.

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో తారక్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కనిపించబోతోంది. శ్రద్ధ గతంలో తెలుగులో ప్రభాస్‌తో సాహో మూవీలో నటించిన సంగతి తెలిసిందే. సాహో తర్వాత ఈ బ్యూటీకి ఎన్టీఆర్‌తోనటించే ఛాన్స్ వచ్చింది. ఇక హిందీలో కూడా వార్-2 అంటూ ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్నాడు. అక్కడ తనకు జోడీగా రష్మికను అనుకున్నారట. కాని సీన్లోకి దీపికా పదుకొనే వచ్చిందని తెలుస్తోంది. హృతిక్ కి జోడీగా మానుషీ, తారక్‌కి జోడీగా దీపికా పదుకొనే అని తెలుస్తోంది.

ఆల్రెడీ దీపికా తెలుగులో ప్రాజెక్ట్ కే అంటూ ప్రభాస్‌‌తో జోడీ కడుతోంది. సో మొత్తానికి తారక్ వరుసగా ప్రభాస్‌తో జోడీ కట్టే హీరోయిన్లతోనే సినిమా చేస్తున్నాడు. లోకల్ హీరోయిన్లు వద్దు, బాలీవుడ్ ముద్దుగుమ్మలే ముద్దంటున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ కోసమే ఇలా తారక్ కొందరి వాడుగా మారిపోతున్నాడట.