Jr NTR: దేవర కోసం ఎన్టీఆర్ స్పెషల్ కేర్.. షూటింగ్ అప్‌డేట్ ఇదే..

దేవర షూటింగ్ అయిపోగానే.. యుద్ధానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. ఇప్పటికే యంగ్ టైగర్ వార్ 2 ప్రాజెక్ట్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు తారక్.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 04:37 PM IST

Jr NTR: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన దేవర గ్లింప్స్‌ అంచనాలను పెంచేసింది. అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో దేవర గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించింది. దేవరగా యంగ్ టైగర్ లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఏప్రిల్ నుంచి అక్టోబర్‌ వరకు షిఫ్ట్ అయింది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర రిలీజ్ కానుంది.

PAWAN KALYAN: పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ప్రచారం ఆగిపోయినట్లేనా..?

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక దేవర షూటింగ్ అయిపోగానే.. యుద్ధానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. ఇప్పటికే యంగ్ టైగర్ వార్ 2 ప్రాజెక్ట్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు తారక్. ప్రస్తుతం హృతిక్ రోషన్‌‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ జాయిన్ అయిన తర్వాత.. ఇద్దరిపై దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌పై మరో నెల రోజులు సోలో సీన్స్ షూటింగ్‌ చేయనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఎన్టీఆర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌తో రెండు వారాల‌పాటు ట్రైనింగ్ సెష‌న్‌లో పాల్గొన‌బోతున్నాడ‌ట‌.

అది కంప్లీట్ అవగానే.. ఈ మంత్ ఎండింగ్‌లో వార్ 2 సెట్స్‌లో జాయిన్ అవనున్నాడు తారక్. అంటే.. సమ్మర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు టైగర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట. కాకపోతే.. టైగర్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. మరి.. వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.