Jr. NTR: వేట మొదలు పెట్టిన తారక్‌..

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వేట మొదలు పెట్టాడు. కొరటాలతో చేస్తున్న ఎన్టీఆర్‌ 30 సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు ఎన్టీఆర్‌. ఓ చిన్న టీజర్‌ వదిలి మాస్‌ హైప్‌ క్రియేట్‌ చేశాడు.

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 03:30 PM IST

విజువల్‌లో ఎన్టీఆర్‌ ఫేస్‌ కనిపించకపోయినా.. వస్తున్నా అనే డైలాగ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలుగిస్తోంది. కొరటాలతో మరోసారి సెట్స్‌కు వెళ్లడం బాగుదంటూ ట్వీట్‌ చేశాడు ఎన్టీఆర్‌. ఫస్ట్‌ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ చేయనున్నాడు కొరటాల. రీసెంట్‌గానే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ చేసిన కొరటాల శివ.. దాదాపు అంతా హాలీవుడ్‌ టీంను దింపాడు. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయని ముందే చెప్పేశాడు. సినిమా లాంచ్‌ చేసిన రోజే స్టోరీ లైన్‌ కూడా చెప్పేసి ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేశాడు.

ముఖ్యంగా కొన్ని ఫైట్‌ సీన్స్‌ కంపోజ్‌ చేసేందుకు కెన్నీ బేట్స్‌ను రంగంలోకి దించాడు. హీలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్‌క్రూజ్‌ మిషన్‌ ఇంపాజిబుల్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌, రాంబో-3 లాంటి సినిమాలకు స్టంట్‌ మాస్టర్‌గా పని చేశాడు కెన్నీ బేట్స్‌. ఆక్వామాన్‌, జస్టిస్‌ లీగ్‌, బ్రాడ్‌ మ్యాన్‌, బ్రాడ్‌ మ్యాన్‌ వర్సెస్‌ సూపర్‌ మ్యాన్‌ లాంటి సినిమాలకు విజువల్‌ ఎఫెక్స్ట్‌ చేసిన బ్రాడ్‌ మైనించ్ ఇప్పుడు ఎన్టీఆర్‌ 30లో కొన్ని సీన్స్‌ సూపర్‌విజన్‌ చేయబోతున్నాడు. ఇప్పటి వరకూ సినిమా నుంచి వచ్చిన లీక్స్‌, మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ఫొటోస్‌ బట్టి చూస్తే బొమ్మ దద్దరిల్లిపోవడం గ్యారెంటీ అంటున్నారు తారక్‌ ఫ్యాన్స్‌.