Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఇకనుంచి యంగ్ టైగర్ అంటే కుదరదు. ఎందుకంటే దేవర గ్లింప్స్‌తోనే తన పేరు మారిపోయింది. ఇక నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనాల్సిందే. అదే ఎనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లో కనిపించింది. టాలీవుడ్‌లో ఈమధ్య హీరోల ట్యాగ్‌లైన్స్ మారిపోతున్నాయి. పుష్ప మూవీ విడుదలకు ముందు బన్నీకి కూడా ఇలానే బిరుదు మార్పు జరిగింది. స్టైలిష్ స్టార్ కాస్తా.. ఐకాన్ స్టార్ అయ్యాడు.
DEVARA: కొరటాల కోసం రిస్క్‌లో పడ్డ మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్..
అలానే అంతకు ముందు యంగ్ రెబల్ స్టార్ అనిపించుకున్న ప్రభాస్, రెబల్ స్టార్‌గా మారిపోయాడు. అలానే ఇక నుంచి రామ్ చరణ్ కూడా మెగా పవర్ స్టార్ కాదు. అది ఒకప్పటి బిరుదు. ఇక నుంచి తను గ్లోబల్ స్టార్. త్రిబుల్ ఆర్‌తో గ్లోబల్‌గా గుర్తింపు దక్కింది కాబట్టే తను గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ విషయంలో మహేశ్ బాబు మాత్రం అందరికంటే ముందే తన బిరుదు మార్చేసుకున్నాడు. ఒకప్పుడు తనని రాజకుమారుడు, ప్రిన్స్ అనేవాళ్లు. గత కొన్నేళ్ళుగా మాత్రం మహేశ్ బాబుని సూపర్ స్టార్ అంటున్నారు.
అలానే ఇప్పుడు తారక్ బిరుదు కూడా యంగ్ టైగర్ నుంచి మాన్ ఆఫ్ మాసెస్‌గా మారింది. మాస్ మహారాజ బిరుదుకి దగ్గరగా ఉన్నా కానీ.. ఈ మార్పుతో రవితేజకొచ్చిన ఇబ్బందేం లేదనే జోకులు కూడా పేలుతున్నాయి.