Jr NTR: వార్ 2 షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ జాయినయ్యేది ఎప్పుడు..?

ఫైటర్ మూవీ షూటింగ్‌ని ఫినిష్ చేసిన హృతిక్ ఈ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం. వార్2లో హృతిక్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. తారక్ బాలీవుడ్‌లో చేస్తోన్న మొట్టమొదటి సినిమా ఇదే.

  • Written By:
  • Publish Date - October 23, 2023 / 06:26 PM IST

Jr NTR: హృతిక్, తారక్ కాంబోలో వార్2 ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. ప్రి ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసిన యూనిట్ సైలెంట్‌గా షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది. యాక్షన్ పార్ట్‌ని ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. మరి తారక్ ఈ ప్రాజెక్ట్‌లో ఎప్పుడు జాయిన్ అవుతాడు..? ఎన్ని రోజులు వర్క్ చేస్తాడు అనే లెక్కలు నడుస్తున్నాయి. టైగర్ 3ని రిలీజ్‌కి రెడీ చేసిన యష్ రాజ్ ఫిలిమ్స్‌ ఇప్పుడు వార్2పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కథ రెడీ చేసిన దర్శకుడు అయన్ ముఖర్జీ తాజాగా వార్2 షూటింగ్ స్టార్ట్ చేశాడు.

స్పెయిన్‌లో ఒక సూపర్ కారు ఛేజింగ్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైటర్ మూవీ షూటింగ్‌ని ఫినిష్ చేసిన హృతిక్ ఈ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం. వార్2లో హృతిక్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. తారక్ బాలీవుడ్‌లో చేస్తోన్న మొట్టమొదటి సినిమా ఇదే. మరి యంగ్ టైగర్ ఈ యాక్షన్ ఘట్టాలలో పాల్గొన్నాడా..? అంటే కొత్త పాయింట్ తెరపైకి వస్తోంది. ప్రజెంట్ దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్ డిసెంబర్‌లో వార్2 సెట్స్‌లో జాయిన్ అయ్యేలా డేట్స్ ఇచ్చాడట. ఎన్టీఆర్ లేని సీన్స్‌ని దర్శకుడు ప్రస్తుతం స్పెయిన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

ఒకసారి తారక్ ఈ షూటింగ్‌లో పాల్గొంటే 50 రోజుల్లో తన వర్క్ కంప్లీట్ చేసేలా మేకర్స్ షెడ్యూల్ రెడీ చేశారట. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకువెళ్లేలా ఎన్టీఆర్ ప్లానింగ్ చేసుకుంటున్నాడు. మొత్తానికి వార్2 షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే అంచనాలు ఎవరెస్ట్ ఎక్కుతున్నాయి.