Jr NTR: ఊహించని సర్‌ప్రైజ్.. దేవర నుంచి ఫస్ట్ సింగిల్

ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్‌తో యంగ్ టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్‌తో సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అందులో ఎన్టీఆర్ మాస్ లుక్, ఫైట్ సీన్స్ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లిపోయాయి.

  • Written By:
  • Publish Date - April 4, 2024 / 12:33 PM IST

Jr NTR: ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ ‘దేవర’. ట్రిపుల్ ఆర్ లాంటి భారీ హిట్ తర్వాత జూనియర్ నుంచి వస్తున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోర్ట్ మాఫియా నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈమూవీలో యంగ్ టైగర్‌ రోరింగ్ పెర్ఫార్మెన్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమా అంచనాలను మరో స్థాయికి తీసుకుని వెళ్లాయి.

PAWAN KALYAN: థియేటర్ల దగ్గర ఉన్న ఉద్యోగులు పింఛన్లు ఇవ్వడానికి లేరా.. ప్రభుత్వానికి పవన్ ప్రశ్న

కాగా.. ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్‌తో యంగ్ టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్‌తో సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అందులో ఎన్టీఆర్ మాస్ లుక్, ఫైట్ సీన్స్ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లిపోయాయి. రెండు పార్టులుగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో ఓ సాలిడ్ అప్డేట్‌ని యంగ్ హీరో విశ్వక్ సేన్ రివీల్ చేశాడు. దీనికితోడు నిర్మాత నాగవంశీ, మరో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ వీరంతా కలిసి ఎన్టీఆర్‌తో దిగిన పిక్స్‌తో చేసిన హడావిడి.. ఫ్యాన్స్‌లో కొత్త సందడి తీసుకొచ్చింది. దేవర ఆల్బమ్‌ కిల్లింగ్‌గా ఉండబోతుందని ఇప్పటికే మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ హింట్ ఇచ్చేశాడు. అయితే.. ఇప్పుడు సినిమా అఫీషియల్ హ్యాండిల్ సహా సినిమా ఆడియో హక్కులు సొంతం చేసుకున్న టీ సిరీస్ వారు కూడా దేవర మ్యూజిక్‌పై ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చి ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చారు.

ఈ మూవీ అఫీషియల్ హ్యాండిల్‌లో ‘దేవర’ GIF ఫైల్‌ని రిలీజ్ చేసి దానికి క్యాప్షన్‌గా దేవర అంటూ మ్యూజిక్ సింబల్స్‌ని పెట్టారు. దీంతో.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందా అంటూ ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అవైటెడ్ ఫస్ట్ సింగిల్ రావడం ఖాయమంటూ సంబర పడుతున్నారు. దేవర ఫస్ట్‌ సింగిల్‌ను తారక్‌ పుట్టినరోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న గాసిప్‌ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. మరి దీనిపై మేకర్స్‌ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి. ఇప్పటికే అనిరుధ్‌ రవిచందర్‌ కంపోజ్‌ చేసిన దేవర ఒరిజినల్‌ సౌండ్ ట్రాక్‌‌ను విడుదల చేయగా.. అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో గూస్ బంప్స్‌ తెప్పిస్తోంది. మరి.. దేవర ఫ్యాన్స్‌కు ఎలాంటి బర్త్‌డే ట్రీట్‌ ఇవ్వబోతున్నాడో చూడాల్సిందే.