Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారాడు. దేవర మూవీతో అక్టోబర్‌లో బాక్సాఫీస్‌పై దాడి చేయబోతున్నాడు. తర్వాత వార్ 2తో 2025 ఆగష్టుని టార్గెట్ చేస్తున్నాడు. కాని రాజమౌళి సెంటిమెంట్‌ని దాటడమే అసాధ్యంగా మారింది. ఒకసారి రాజమౌలి మేకింగ్‌లో సినిమాచేస్తే, హిట్్తోపాటు ఇమేజ్ కూడా పెరుగుతుంది. కానీ, ఆ తర్వాత అదే హీరో ఏ మూవీ చేసినా ఫ్లాప్ పడుతుంది.
Mansoor Ali Khan: తమిళ నటుడిపై విష ప్రయోగం జరిగిందా.. ఇప్పుడెలా ఉన్నాడు..?
అంతగా హీరో ఇమేజ్ పెరగటం వల్లే ఇలా అంచానాలు అందుకోలేని మూవీ వల్ల సీన్ రివర్స్ అవుతోంది. ఈగ తర్వాత నాని వరుసగా ఫ్లాపులే ఫేస్ చేశాడు. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా మూడు పంచ్‌లు పడ్డాకే సలార్‌తో గట్టెక్కాడు ప్రభాస్. ఇక చరణ్ కూడా ఆచార్యతో ప్లాప్ ఫేస్ చేశాకే గేమ్ ఛేంజర్‌తో ఎటాక్ చేయబోతున్నాడు. ఇంకా చరణ్ ఈ సినిమాతోనైనా గట్టెక్కుతాడో లేడో తెలియని పరిస్తితి. మరి త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్‌లానే తారక్ కూడా దేవరతో ఫెయిల్యూర్ ఫేస్ చేయాల్సి వస్తుందా? అయితే, దేవర గ్లింప్స్ బాగుంది. తారక్‌ను హిట్ మెట్టెక్కించేలానే ఉంది. కాని గతంలో రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ తర్వాత తారక్‌కి పంచ్ పడింది.
ఆ సెంటిమెంటే రిపీట్ అయితే దేవర గట్టెక్కటం కష్టం. అందుకే దేవర కావాల్సినంత డిలే చేస్తున్నాడా? అది మిస్ అయినా వార్ 2 కాపాడుతుందనే ఈ సినిమా కోసం డేట్లు పెంచాడా..? సినీ వర్గాల్లో ఈ డౌట్లు పెరిగాయి. కాని ఇవన్నీ పక్కన పెట్టి దేవర హిట్ అయితే, మాత్రం ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసిన రికార్డు మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్‌కే దక్కుతుంది.