DEVARA: దేవర మీద మూకుమ్మడి దాడి.. పోటీ తట్టుకోగలడా..?

ఎన్టీఆర్‌కి గ్లోబల్ గా ఉన్న ఇమేజ్, పాన్ ఇండియా లెవల్లో ఉన్న మార్కెట్.. ఇలా ఇన్ని కలిసొచ్చే అంశాలున్నా, అక్టోబర్‌లో పరిస్థితులు పగపట్టేలా ఉన్నాయి. దేవర అక్టోబర్ 10న రాబోతోంది. కాని అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వేటయాన్ రాబోతోంది.

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 05:09 PM IST

DEVARA: దేవర మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కావాలి. కానీ, ఈ చిత్రం వాయిదా పడటంతో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది. దేవరలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కి సెట్లో గాయమవ్వటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో, అక్టోబర్ 10కి వాయిదా వేశారు. అలా జరగకుండా ఈనెలలోనే సినిమా విడుదలయ్యుంటే సౌత్, నార్త్ మార్కెట్‌లో కూడా సోలోగా దేవర దుమ్ముదులిపేది. అదే అక్టోబర్‌లో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు.

GVL Narasimha Rao: విశాఖలో జీవీఎల్ పోస్టర్స్.. ఫ్రెండ్లీగా పోటీ చేస్తా.. అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ !

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కి గ్లోబల్ గా ఉన్న ఇమేజ్, పాన్ ఇండియా లెవల్లో ఉన్న మార్కెట్.. ఇలా ఇన్ని కలిసొచ్చే అంశాలున్నా, అక్టోబర్‌లో పరిస్థితులు పగపట్టేలా ఉన్నాయి. దేవర అక్టోబర్ 10న రాబోతోంది. కాని అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వేటయాన్ రాబోతోంది. మరో తమిళ స్టార్ అజిత్ సినిమా విడాముయార్చి కూడా రానుంది. వీళ్ల వల్ల తెలుగు మార్కెట్‌లో, బాలీవుడ్ మార్కెట్‌లో పెద్ద ఇబ్బంది లేదు. కాని తమిళ్ మార్కెట్‌లో ఈ సినిమాలతో దేవర పోటీ పడటం చాలా కష్టమే. దేవర ఎంత బాగున్నా, రజినీకాంత్, అజిత్ మూవీలొస్తున్నాయంటే తమిళ జనం ఎగబడతారు. ఆపోటీని తట్టుకోవటం కష్టం. ఇక టాలీవుడ్‌లో సెప్టెంబర్ 27కి ఓజీ వస్తుంది. అది కూడా దేవర రావటానికి 12 రోజులు ముందే వస్తోంది. అంటే.. అలా కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ ఓజీ వాయిదా పడితే, దేవర విడుదలయ్యే రోజే రావొచ్చు. సో అదే జరిగితే, టాలీవుడ్ మార్కెట్‌లో వసూళ్లు చీలే ఛాన్స్ ఉంది.

సరే బాలీవుడ్ పరిస్థితైనా బాగుందా అంటే, నాగచైతన్య తండెల్ అక్టోబర్ 10నే రాబోతోంది. చైతన్య ఏరకంగా కూడా తారక్ కి పోటీ కాకున్నా, ఆసినిమా డైరెక్టర్ చందూ మొండేటి కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టాడు. ఆకోణంలో ఇక్కడ తెలుగులో, హిందీలో కూడా తండెల్ మూవీకి మంచి అటెన్షనే దక్కొచ్చు. ఇలా సౌత్, నార్త్‌లో దేవరకి మీడియం రేంజ్ నుంచి ఓరేంజ్ వరకు పోటీ ఇచ్చే సినిమాల లిస్ట్ పెరుగుతోంది.