Jr NTR: ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత చేస్తున్న మూవీ దేవర. ఇది రెండు భాగాలుగా రాబోతుందన్నారు. జనవరిలో షూటింగ్ పూర్తిచేస్తామన్నారు. అంతా బాగానే ఉంది. కాని కొరటాల శివ సడన్‌గా తన స్పీడ్ తగ్గించి దేవర షూటింగ్ స్లో డౌన్ చేశాడట. జనవరిలో ప్యాక్ అప్ అవుతుందనుకున్న మూవీ షూటింగ్ ఏకంగా మార్చ్ ఎండ్‌కి కూడా అయ్యేలా లేదట. క్లైమాక్స్ తాలూకు భారీ సెట్‌తో పాటు చాలా కాంప్లెస్స్ సీన్స్ పూర్తిచేయాలట. దానికి యాక్షన్ కొరియోగ్రఫర్, గ్రాఫిక్ డిజైనర్‌ల మధ్య కో ఆర్డినేషన్ కావాలి.
TOLLYWOOD: టాలీవుడ్‌ను రేవంత్ టార్గెట్ చేస్తారా.. డ్రగ్స్ కేసు బయటకు వస్తుందా..?
అదంతా ప్లాన్ చేసి షూట్ చేసేందుకే ఆ సీన్లకు 2 నెలలు టైం పట్టేలా ఉందట. అలా ప్లానింగ్‌లో తేడా రావటంతో దేవర పార్ట్ 1 షూటింగ్ జనవరిలో కాదు కదా.. మార్చ్ చివరికి లేదంటే ఏప్రిల్ వరకు కొనసాగొచ్చు. అలా అయితే ఏప్రిల్ 5కి దేవర రాకపోవచ్చంటున్నారు. ఇలా దేవర రిలీజ్ డేట్‌ని డౌట్‌లోకి నెట్టడమే కాదు.. కొరటాల వల్ల వార్ 2 ఫ్యూచరే మారింది. ఈ సినిమా నిజానికి ఈనెల 15లోగా షురూ కావాలి. దేవర ఆలస్యం అవుతుండటంతో జనవరి 18 నుంచి వార్ 2 షూటింగ్ అంటూ ప్లాన్ మార్చారు. ఇప్పుడు తీరా సీన్ చూస్తే సమ్మర్‌లోనే వార్ 2 పట్టాలెక్కేలా ఉంది. రూ.600 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్‌కి ఇటు తారక్, అటు హృతిక్ కమిట్‌మెంట్ ఇచ్చారు. అందువల్ల వార్ 2 సినిమాను బట్టే ఈ ఇద్దరు హీరోలు మిగతా సినిమాలకు కమిటవ్వాలి.
కాని దేవర షూటింగ్ ఆలస్యం అవటంతో వార్ 2 షూటింగ్ షురూ అవటమే కష్టంగా మారింది. దీంతో హృతిక్ కమిటవ్వాల్సిన వేరే మూవీకి డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోయాడట. ఏదేమైనా దేవర షూటిండ్ స్లో అవటంతో వార్ 2 షూటింగ్ సమ్మర్‌కి షిఫ్ట్ అవ్వటమే కాదు.. వార్ 2ని 2025 జనవరి నుంచి ఆగస్ట్‌కి రిలీజ్ డేట్ వాయిదా వేయాల్సి వస్తోందట.