Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్..!

ఎన్టీఆర్‌, కొరటాల సినిమా లేటైతే అయిందిగానీ.. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ నడుస్తోంది. మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అనుకున్న ప్రకారమే.. అనుకున్న షెడ్యూల్లో పూర్తవుతోంది. ముందే చెప్పినట్టు.. ఏప్రిల్ 5న రావడం గ్యారెంటీ. డిసెంబర్‌ నాటికి దేవర షూటింగ్‌ పూర్తిచేసిన వెంటనే తారక్‌ అమెరికా వెళ్లి కండలు పెంచుతాడట.

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 08:42 PM IST

Jr NTR: ఎన్టీఆర్‌ దేవర వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్‌ అవుతోంది. దేవర రిలీజ్‌ కాకుండానే.. మరో రెండు సినిమాలు మొదలు పెట్టేస్తున్నాడు తారక్‌. యంగ్‌ టైగర్‌ ప్లానింగ్‌ చూస్తుంటే.. ఫ్యాన్సే కాదు అందరూ షాక్‌ తింటున్నారు. ఎన్టీఆర్‌, కొరటాల సినిమా లేటైతే అయిందిగానీ.. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ నడుస్తోంది. మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అనుకున్న ప్రకారమే.. అనుకున్న షెడ్యూల్లో పూర్తవుతోంది. ముందే చెప్పినట్టు.. ఏప్రిల్ 5న రావడం గ్యారెంటీ.

డిసెంబర్‌ నాటికి దేవర షూటింగ్‌ పూర్తిచేసిన వెంటనే తారక్‌ అమెరికా వెళ్లి కండలు పెంచుతాడట. అందరూ ప్రత్యేక ట్రైనర్‌ ఆధ్వర్యంలో ఇక్కడే వర్కవుట్స్‌ చేస్తుంటే.. తారక్‌ మాత్రం వార్‌2 కోసం.. అమెరికా వెళ్లి మేకోవర్‌ అవుతాడని తెలిసింది. వార్‌2 వచ్చే జనవరి చివర్లో.. లేదంటే ఫిబ్రవరి మొదట్లో సెట్స్‌పైకి వెళ్తుంది. ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ఫ్లాన్స్‌ మామూలుగా లేదు. అన్ని సినిమాలను సెట్‌ చేసేస్తున్నాడు. వార్‌2 పూర్తి కాకుండానే ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో తారక్‌ జాయిన్‌ అవుతాడు. డిసెంబర్‌ 22న ‘సలార్‌’ రిలీజ్‌ కాగానే.. ప్రశాంత్‌ నీల్‌.. ఎన్టీఆర్‌ సినిమా కథకు ఫైనల్‌ టచ్‌ ఇస్తాడు.

2024 సమ్మర్‌ నాటికి స్కిప్ట్ రెడీ చేయడంతోపాటు.. ఏప్రిలే లేదా మేలో సినిమాను సెట్స్‌పైకి తీసుకొస్తాడట. ఇలా దేవర.. వార్‌2.. ప్రశాంత్‌నీల్‌ మూవీని పక్కాగా ప్లాన్‌ చేశాడు తారక్‌. దీంతో ఫ్యాన్స్‌కు వరుసగా క్రేజీ మూవీస్‌తో ట్రీట్ ఇవ్వబోతున్నాడు.