మీరేం పీకారని నా మొగుడ్ని టార్గెట్ చేసారు…? జ్యోతిక ఫైర్

రీసెంట్ గా రిలీజ్ అయిన కంగువ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాపై నెగటివ్ రివ్యూలు రాయడంతో సినిమాపై భారీగానే ప్రభావం పడింది.

  • Written By:
  • Updated On - November 18, 2024 / 12:08 PM IST

రీసెంట్ గా రిలీజ్ అయిన కంగువ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాపై నెగటివ్ రివ్యూలు రాయడంతో సినిమాపై భారీగానే ప్రభావం పడింది. దీనిపై హీరో సూర్య భార్య జ్యోతిక ఫైర్ అయ్యారు. ఇది నేను సూర్య భార్యగా రాయడం లేదు అంటూ… ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఒక సినీ ప్రేమికురాలిగా రాస్తున్నానని కంగువ ఓ అద్భుతమైన సినిమా అంటూ కొనియాడారు. సూర్య మీరు ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని హర్షం వ్యక్తం చేసింది.

ఈ సినిమాను మీ డ్రీమ్ అని… దానిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని పేర్కొంది. అందరూ చెప్తున్నట్టుగానే.. సినిమాలో మొదటి అరగంట కాస్త వర్క్ అవుట్ కాలేదన్న జ్యోతిక… సౌండ్లో కూడా కాస్త సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఇలాంటి లోపాలు సినిమాల్లో ఓ భాగమన్న ఆమె… భారతీయ చిత్రాల్లో ఇది చాలా కామన్ అన్నారు. ముఖ్యంగా సరికొత్తగా సినిమాలు చేయాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటివి జరుగుతాయని ఆరోపణలు కొట్టి పారేసింది. వాటిని ప్రయోగాల్లో భాగంగానే చూడాలని క్లారిటీ ఇచ్చింది జ్యోతిక.

అయితే మొదటి అరగంట సినిమాని పట్టుకుని.. తర్వాతి రెండున్నర గంటల సినిమాని నెగిటివ్ చేయడం సరికాదని హితవు పలికింది. నిజం చెప్పాలంటే కంగువ అనేది గొప్ప సినిమేటిక్ అనుభవం అని తెలిపింది జ్యోతిక. కెమెరా వర్క్, దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానాన్ని నేను తమిళ సినిమాల్లో ముందెప్పుడు చూడలేదని… అయితే కొందరు మీడియాకి చెందిన వ్యక్తులు, మరికొందరు కలిసి.. కావాలనే సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఫైర్ అయింది. నెగిటివ్ రివ్యూలు చూసి నేను షాక్ అయ్యానన్న జ్యోతిక… మీడియాకి చెందిన వారు.. మరికొందరు కంగువకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారని మండిపడింది.

స్త్రీలను ఇబ్బంది పెట్టడం, పాత కథే చెప్పడం, డబుల్ మీనింగ్ డైలాగ్లతో వచ్చిన అనేక పాన్ ఇండియా సినిమాలకి ఏ మేధావి నెగిటివ్ రివ్యూ ఇవ్వలేదని… అలాంటి చెత్త లేని ఈ సినిమాకి మాత్రం ఇలాంటి రివ్యూలు కరెక్ట్ కాదన్నారు. సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్లు.. దాని గురించి పాజిటివ్గా రాయడం మరచిపోయారని మండిపడ్డారు. అలాంటి రివ్యూలను చదవాలా? వినాలా? నమ్మాలా? నాకు తెలియట్లేదన్న ఆమె… కంగువను 3D సినిమాగా రూపొందించడానికి చిత్రబృందం పడిన కష్టానికి వారికి ప్రశంసలు రావాలని… అవి రాకపోగా.. మొదటి షో పూర్తవకముందే.. కొందరు కావాలనే సినిమాపై నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారని మండిపడింది. సినిమా విడుదలైన మొదటి రోజే ఇంత నెగిటివ్ టాక్ని ప్రచారం చేయడం చాలా విచారించాల్సిన విషయమన్న ఆమె… ఈ రివ్యూలు రాసిన వారు సినిమాని ఉద్దరించడానికి వారి కెరీర్‌లో ఏమి చేసి ఉండరని ఫైర్ అయింది. అందుకే వాళ్లకు పాజిటివ్‌గా మాట్లాడటానికి ఒక్క పాయింట్ కనిపించలేదంటూ తన భర్త సినిమాను టార్గెట్ చేసిన వారిపై జ్యోతిక విరుచుకుపడింది.