క మూవీ రివ్యూ, పెళ్లి గిఫ్ట్ ఇచ్చేసిన ఆడియన్స్

హిట్ ఫ్లాప్ అనే కాన్సెప్ట్ తో ఏ మాత్రం లింక్ లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేసే కిరణ్ అబ్బవరం... పెళ్లి తర్వాత దీపావళి కానుకగా క అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గురువారం విడుదలైన ఈ సినిమా అసలు ఎలా ఉంది...

  • Written By:
  • Publish Date - October 31, 2024 / 12:31 PM IST

హిట్ ఫ్లాప్ అనే కాన్సెప్ట్ తో ఏ మాత్రం లింక్ లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేసే కిరణ్ అబ్బవరం… పెళ్లి తర్వాత దీపావళి కానుకగా క అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గురువారం విడుదలైన ఈ సినిమా అసలు ఎలా ఉంది… పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం రిలీజ్ చేసిన ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది చూద్దాం.

సుజీత్‌ – సందీప్‌ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమా కథను రాసి డైరెక్ట్ చేసారు. నయన్‌ సారిక, తన్వీ రామ్‌, అచ్యుత్‌కుమార్‌, రెడిన్‌ కింగ్‌స్లే సహా పలువురు నటులు ఈ సినిమాలో మెప్పించారు. సినిమా ప్రమోషన్స్‌లో కిరణ్‌ అబ్బవరం సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. ఇలాంటి కథ ఇప్పటి వరకూ రాలేదు, వస్తే సినిమాలు మానేస్తా అని ఓ సంచలన కామెంట్ చేయగా అది బాగా వైరల్ అయింది. సినిమా ప్రమోషన్స్ ను కూడా చాలా బాగా చేసాడు. 1980ల్లో సాగే ఈ కథను డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించారు.

మధ్యాహ్నాం మూడు గంటలకే చీకటి పడే క్రిష్టగిరి గ్రామం, అదే గ్రామంలో అమ్మాయిలు తప్పిపోతున్నారనే సమస్య గ్రామస్తులను భయపెడుతూ ఉంటుంది. ఆ సమస్య పరిష్కారానికి వెళ్ళే హీరో ఏ సమస్యలు ఎదుర్కొంటాడు అనేది కథ. ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్‌ మిస్సింగ్‌ కేసులకు సంబంధించి ఉత్తరాల ద్వారా విషయం తెలుసుకుని పోరాటం చేయడానికి వెళ్తాడు. యాక్షన్ పార్ట్ లో హీరో నటన హైలెట్. సినిమాలో ప్రేమ కథ కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్ లు.

మనిషి పుట్టుక.. కర్మ, దాని పర్యావసానం, రుణానుబంధాలకు లింక్ చేస్తూ డైరెక్టర్ లు కథ రాసుకున్నారు. ముసుగు వ్యక్తి హీరోని కిడ్నాప్‌ చేసిన దగ్గరి నుంచి ఈ సినిమా మొదలవుతుంది. చీకటి గదిలో బంధించి ముసుగు వ్యక్తి కాలచక్రం సాయంతో హీరోని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్పించడం ఆడియన్స్ కు పిచ్చి ఎక్కిస్తుంది. ఫస్టాఫ్‌ కాస్త స్లోగా సాగినా ఇంటర్వెల్‌ ట్విస్ట్ తో ఆడియన్స్ ఆసలు స్లో ఉంది అనే ఫీల్ లో ఉండరు. స్పెన్స్‌మెయిన్‌టెన్‌ చేస్తూ థ్రిల్‌ పెంచడంలో కాస్త ఫెయిల్ అయినట్టు అనిపించినా… సినిమా మాత్రం చాలా కొత్తగా ఉంది.

సెకండ్ ఆఫ్ సినిమాకు ప్లస్ పాయింట్. కోర్టు దగ్గర యాక్షన్‌ సీక్వెన్స్‌, క్లైమాక్స్‌ ఫైట్‌ సినిమాను ఓ రేంజ్ కు తీసుకు వెళ్ళాయి. బలగం జయరామ్‌, అచ్యుత్‌ కుమార్‌, శరణ్య ప్రదీప్‌, అన్నపూర్ణమ్మ, అజయ్‌, బిందు చంద్రమౌళి వంటి నటులు సినిమాలో చాలా బాగా నటించారు. కామెడి పార్ట్ కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనే కామెంట్ వచ్చినా కథలో పట్టు ఉండటంతో సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కచ్చితంగా ఆడియన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. కిరణ్ అబ్బవరం కెరీర్ కు ఈ సినిమా కచ్చితంగా ప్లస్ అవుతుంది. హీరోయిన్ నటన కూడా చాలా బాగా ఆకట్టుకుంది.