ఇక సినిమా విషయానికొస్తే అందరూ అగ్రనటీనటులే ఉన్నారు. ఉపేంద్ర, సుధీప్ కథానాయకుడిగా కనిపించగా.. శ్రియాశరణ్, కోట శ్రీనివాస రావు మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించనున్నారు. ఈచిత్రం పూర్తిగా స్వాతంత్ర్య కాలం నాటి పరిస్థితులను చూపిస్తూ.. ఒక రాజు కుటుంబీకుల చరిత్ర గురించి చెబుతోంది. అలాగే ప్రతి ఫ్రేమ్ లో కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉట్టిపడుతుండటం అందరికీ ఆసక్తిని రేపుతోంది. ట్రైలర్ నిడివి 3నిమిషాల 10 సెకెండ్లు ఉన్నప్పటికీ కథను ఏమాత్రం చూపించకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు. చరసాలలో బంధించి ఇద్దరు పిల్లలను మంటల్లో తగలబెట్టే సీన్ లో శ్రియా రావడంతో ఏమి జరిగింది.. అనే ఉత్కంఠను థియేటర్లలో చూడండి అనేలా ఉంది తాజాగా విడుదలైన ట్రైలర్. మరోక అంశం ఏమిటంటే ఆ చరసాలలో బంధింపబడ్డ ఇరువురు పిల్లలే ఈ కథానాయకులా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇందులో ఇద్దరు ఫేమస్ స్టార్లు నటించడం వారిద్దరిమధ్య ఉన్న డైలాగ్ వార్ సినిమాకి హైప్ క్రియేట్ చేశాయి. దీనిని ఆర్. చంద్రు నిర్మాతతోపాటూ దర్శకత్వం కూడా వహించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రవి బస్రూర్ అద్భుతంగా అందించారు. చివర్లో వచ్చే if you want to play me.. i will play the game, if you want kill me.. i will end the game అనే డైలాగ్ ఆధిపత్యపోరును స్పష్టంగా చూపిస్తుంది. ఈ సినిమా సుమారు ఏడు భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఏ కన్నడ సినిమా ఏడు భాషల్లో విడుదల కాలేదు. ఇదే తొలిసారి కావడంతో రికార్డుకెక్కింది.