కల్కీ 1000 కోట్లు.. దేవర 1000కోట్లు… పుష్ప2 కూడా 1000 కోట్లు..!

పుష్ప రాజ్ కూడా దేవర లానే వెయ్యికోట్ల వేటకోసమే రంగంలోకి దిగుతున్నాడు. పుష్పగా ఒకసారి పాన్ఇండియాని షేక్ చేసినే స్టైలిష్ స్టార్, రెండో సారి బాక్సాఫీస్ బెండుతీసేపనిలో ఉన్నాడు. ఇక ఇదెంత సినీ సునామీ క్రియేట్ చేస్తుందో అనుకునే లోపే, ప్రీరిలీజ్ బిజినెస్ తో పుష్ప 2 ఆల్ ఇండియా రికార్డులన్నీ తిరగరాస్తోంది.

  • Written By:
  • Publish Date - October 13, 2024 / 02:23 PM IST

పుష్ప రాజ్ కూడా దేవర లానే వెయ్యికోట్ల వేటకోసమే రంగంలోకి దిగుతున్నాడు. పుష్పగా ఒకసారి పాన్ఇండియాని షేక్ చేసినే స్టైలిష్ స్టార్, రెండో సారి బాక్సాఫీస్ బెండుతీసేపనిలో ఉన్నాడు. ఇక ఇదెంత సినీ సునామీ క్రియేట్ చేస్తుందో అనుకునే లోపే, ప్రీరిలీజ్ బిజినెస్ తో పుష్ప 2 ఆల్ ఇండియా రికార్డులన్నీ తిరగరాస్తోంది. ఒక వైపు దేవర సునామీ రుచి చూసిన డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు పుష్ప 2 మీద మరిన్న ఆశలు పెంచుకోవటం కామన్… అదేజరుగుతోంది. ఐతే బాలీవుడ్ లో కూడా ఇంతవరకు సాధ్యం కాని, ఓ రేరెస్ట్ రికార్డు ఈ ఏడాది ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఒకే ఏడాది వెయ్యికోట్లు రాబట్టిన మూడు సినిమాలంటూ హీరోల ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే చర్చొకటి మొదలైంది… ఆ సంగతేంటో చూసేయండి…

వెయ్యికోట్లు ఇప్పుడు తెలుగు హీరోలకి, పాన్ ఇండియా ఇమేజ్ తో సర్వ సాధారణం అయ్యేలా ఉంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఒకే ఏడాది మూడు సార్లు, మూడు మూవీలతో వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టడం అంటే, బాలీవుడ్ మొత్తం ఉలిక్కి పడే చరిత్ర ఇది. అలాంటి హిస్టారికల్ ఈవెంట్ లో రెండో అడుగు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరదైతే, మొదటి అడుగు రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీది… మరి మూడో అడుగు ఎవరిది అంటే, అందరి నుంచి వస్తున్న క్లియర్ కట్ ఆన్సర్ పుష్పరాజ్..

పుష్ప మొదటి భాగం పాన్ ఇండియాని ఊపేసింది. 450 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. 3 ఏళ్ల తర్వాత పుష్ప 2 రాబోతోంది. ఈలోపే 2024 ని 1200 కోట్లవసూళ్లతో రెబల్ స్టార్ ప్రభాస్ భోనీ చేశాడు. ఈ ఏడాదికి మొదటి వెయ్యికోట్ల వసూళ్లని రెబల్ స్టార్ ప్రభాస్ పరిచయం చేశాడు. బాహుబలి 2 తర్వాత రెండో సారి వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన పాన్ ఇండియా హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు

ఇప్పుడు తన తర్వాత వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆల్రెడీ తన దేవర మూవీ 850 కోట్ల వసూళ్లని రాబట్టింది. ఇదంతా 13 రోజుల్లోనే జరిగింది. ఇక గురు, శక్రవారం, వసూళ్లు, శనివారం మొదటి రెండు ఆటలతో వచ్చే కలెక్షన్స్ తో ఈ సినిమా దసరా రోజు వెయ్యికోట్ల క్లబ్ లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది

అంటే వినాయక చవితికి ముందు కల్కీ మూవీ వెయ్యికోట్ల వరద తెచ్చింది. దసరాకి ముందు దేవర వెయ్యికోట్ల సునామీ మొదలైంది. ఇప్పుడు క్రిస్మస్, సంక్రాంతి సీజన్ లో పుష్ప2 వచ్చి వెయ్యికోట్ల వసూళ్ల వరద తెచ్చేలా ఉన్నాడు.

ఆల్రెడీ ఓటీటీ రైట్స్, ఓవర్ సీస్ రైట్స్, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్, ఇలా అన్నీ లెక్కేస్తే ప్రీరిలీజ్ బిజినెస్సే 999 కోట్లని తేలింది. సో ఏమాత్రం టాక్ బాగున్నా పుష్ప 2 రిలీజైన రెండు వారాల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది..

ఇదే జరిగితే ఇక బాలీవుడ్ లో ఖాన్లు కపూర్లకు నిద్రుండదు. ఎందుకంటే హిందీలో దంగల్, పటాన్, జవాన్ మూవీలే 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. ఆల్రెడీ బాహుబలి, త్రిబుల్ ఆర్, కల్కీ సినిమాలు 1`000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి బీటౌన్ కి ఈక్వల్ గా దూసుకెళ్లాయి. సో దేవర 1000 కోట్లు రాబడితే, బాలీవుడ్ ని దాటినట్టౌైతుంది. ఇక పుష్ప 2 కూడా 1000 కోట్లు రాబడితే ఇలాంటి రికార్డులు 5 సార్లు క్రియేట్ చేసిన ఇండస్ట్రీగా టాలీవుడ్ పేరు మారుమోగుతుంది. బాలీవుడ్ మూడుసార్లు రాబట్టిన 1000 కోట్ల రికార్డుని తెలుగు హీరోలు, ఒకే ఏడాది రాబడితే, అది మరిచిపోలేని చారిత్రాత్మక రికార్డు అవుతుంది… అదే జరగబోతోంది.