Kalki ntr : ‘కల్కి’లో కృష్ణుడిగా ఎన్టీఆర్..!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కల్కి 2898 AD'.. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.

 

 

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 AD’.. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎందరో ప్రముఖ నటీనటులు భాగమైన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి వారు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో శ్రీ కృష్ణుడు పాత్రకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.

‘కల్కి’లో అశ్వత్థామ సహా మహాభారతంలోని పలు పాత్రలు కనిపించనున్నాయి. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని ప్రచారముంది. ఇక ఇప్పుడు కృష్ణుడి పాత్రకి సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

‘కల్కి’ చిత్రంలో కృష్ణుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారట. తెలుగువారికి రాముడైనా, కృష్ణుడైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు సీనియర్ ఎన్టీఆర్. అందుకే ఇప్పటి హీరోలను ఆ పాత్రలో చూపించే కంటే.. టెక్నాలిజీని ఉపయోగించి కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ను కాసేపు కనిపించేలా చేయడమే కరెక్ట్ అని మూవీ టీం భావించారట. అలా టెక్నాలిజీ పుణ్యమా అని ‘కల్కి’ చిత్రంలో కృష్ణుడి రూపంలో కాసేపు సీనియర్ ఎన్టీఆర్ సందడి చేయనున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగమైనట్లు ఇన్ సైడ్ టాక్. ఆయన పరశురాముడి పాత్రలో కనువిందు చేయనున్నాడని వినికిడి. ఈ వార్తలు నిజమైతే.. ఒకే సినిమాలో కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్, పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే.. నందమూరి అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది.