Kalki 2898 AD : కల్కి బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే

కల్కి 2898 AD (Kalki 2898 AD) విడుదలకు కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

కల్కి 2898 AD (Kalki 2898 AD) విడుదలకు కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా చాలా పెద్ద స్టార్ ప్యాన్-ఇండియా చిత్రాలకు, నిర్మాతలు ప్రీ-రిలీజ్ (Pre Release Event) బిజినెస్, ఇతర హక్కులతో దాదాపు సేఫ్ జోన్ లోనే ఉంటారు. కానీ.. ప్రాజెక్ట్ విజయం లేదా వైఫల్యం ప్రధానంగా దర్శకుడిని ప్రభావితం చేస్తుంది. వారి తర్వాత సినిమాలపై కూడా ఈ ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కల్కి విషయంలో మాత్రం … ఈ మూవీ భారమంతా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) మీద ఎంత ఉందో.. నిర్మాత అశ్విని దత్ మీద కూడా అంతే ఉంది. ప్రభాస్, ఇతర తారలకు ఈ చిత్రం కీలకమైనప్పటికీ, ఈ మూవీ విజయం ఎక్కువగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కే ఉందని చెప్పొచ్చు. అయితే.. ఎవరు ఎన్ని అనుమానాలు పెట్టుకున్నా కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే.. ఇలా చెప్పడానికి కచ్చితమైన కారణాలు కూడా ఉన్నాయి.

కల్కి 2898 AD భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ అంతా నిర్మాత అశ్విన్ దత్ సొంతం. ఈ సినిమా మల్టీ పార్ట్ ఫిల్మ్, పార్ట్ 2లో కొంత భాగం కూడా పూర్తయింది. సెకండ్ పార్ట్ పై కాస్త ఇంట్రెస్ట్ రావాలంటే ఈ సినిమా భారీ విజయం సాధించాలి. లేకపోతే.. రెండో భాగం కూడా తేడా కొట్టేస్తుంది. ఏదైనా తప్పుగా చిత్రీకరించబడితే ప్రేక్షకుల మతపరమైన మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఇది చాలా ప్రమాదకరమైన పని. రామాయణాన్ని సరిగ్గా చిత్రీకరించనందుకు ఓం రౌత్‌తో ఇటీవల ఏమి జరిగిందో మనమందరం చూసినందున నాగ్ అశ్విన్‌కి ఇది పెద్ద పని. దీనిని ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడు అనే విషయం కూడా ఆసక్తి గా ఉంది.

టాలీవుడ్ బయ్యర్లు, ఎగ్జిబిటర్‌లు పని చేయడానికి పెద్ద సినిమా అవసరం. ప్రేక్షకులతో థియేటర్‌లు నిండిపోవాలని చూస్తున్నారు. గత 2 నెలలుగా ఎన్నికలు జరగడం, చిన్న సినిమాలు సరిగా పనిచేయకపోవడంతో కల్కి కోసం భారీగా పెట్టుబడి పెట్టారు. ప్రభాస్‌కు పాన్ ఇండియా విజయం అవసరం: బాహుబలి సిరీస్ తర్వాత, ప్రభాస్ స్టార్‌డమ్ బాగా పెరిగింది. కానీ, ఆ తర్వాత అతను మరో క్లీన్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ని చూడలేదు.అన్ని భాషలలో ఏ సినిమా పని చేయలేదు. సాహో హిందీలో బాగా వర్క్ చేయగా, సాలార్ తెలుగులో డీసెంట్ గా వర్క్ చేశాడు. కానీ అతనికి సరైన బ్లాక్ బస్టర్ లేదు. అందుకే.. ప్రభాస్ కి కూడా కల్కి విజయం చాలా అవసరం ఉంది. మరి.. ఎంత వరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే… మరో రెండు వారాలు ఆగాల్సిందే.