KALKI 2898 AD: రెబల్ స్టార్ ఫుల్ రిలాక్స్.. ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదా..?

నిర్మాత అశ్వినీ దత్ కూడా డిస్ట్రిబ్యూటర్లతో వాయిదా గురించి చర్చించాడట. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటరో వాళ్లనే అడిగి తెలుసుకున్నాడు. ఐతే పుష్ప 2 ఆగస్ట్ 15న రాకుండా వాయిదా పడితే ఆ ముహుర్తానికి కల్కి వస్తుంది.

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 05:46 PM IST

KALKI 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ మే 9న రావాలి. అంటే గట్టిగా లెక్కేస్తే నెల టైం ఉంది. ఇంకా షూటింగ్‌కి గుమ్మడి కాయ కొట్టలేదనే టెన్సన్ మొన్నటి వరకు ప్రభాస్ నుంచి దర్శకుడు నాగ్ అశ్విన్ వరకు అందరి ముఖాల్లో కనిపించేది. కాని ఇప్పుడు అంతా రిలాక్స్ అయిపోయారు. మోకాలి నొప్పితో కూడా షూటింగ్‌లో జాయిన్ అయిన ప్రభాస్, ఇప్పుడు కూల్ బ్రదర్ అంటున్నాడు. కారణం కల్కి 2898 ఏడీ మూవీ వాయిదా పడటమే.

MAHESH BABU: ఏమున్నాడ్రా బాబు.. స్టన్నింగ్ లుక్‏లో మహేష్..

ఇదింకా అఫీషియల్‌గా తేల్చలేదు. కాని ఈ వారమే ఎనౌన్స్ చేస్తారట. అందుకే.. ఎలాగూ వాయిదా పడింది కాబట్టి, పెండింగ్ ప్యాచ్ వర్క్ నిదానంగా చేద్దామనే ఉద్దేశంతో ప్రభాస్‌తో పాటు నాగ్ అశ్విన్ కూల్ అయ్యాడట. నిర్మాత అశ్వినీ దత్ కూడా డిస్ట్రిబ్యూటర్లతో వాయిదా గురించి చర్చించాడట. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటరో వాళ్లనే అడిగి తెలుసుకున్నాడు. ఐతే పుష్ప 2 ఆగస్ట్ 15న రాకుండా వాయిదా పడితే ఆ ముహుర్తానికి కల్కి వస్తుంది. అలా కాకుండా పుష్ప 2 అనుకున్నట్టే విడుదలైతే, సెప్టెంబర్ 27కి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారట. కాని సెప్టెంబర్ 27న ఓజీ వచ్చే చాన్స్ ఉంది. అయితే ఓజీ టీంతో మాట్లాడి కన్విన్స్ చేసే ఆలోచనలో అశ్వినీదత్ ఉన్నాడని, అది కుదరకపోతే అక్టోబర్ 10నే కల్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అప్పుడు దేవర విడుదల కాకపోవచ్చనే అనుమానాలతో ఆ ముహుర్తం మీద కూడా కన్నేసింది ఫిల్మ్ టీం. ఇలా మరో మూవీ వాయిదా పడితే కల్కి వస్తుంది. లేదా మరో ముహుర్తం చూసుకునే ప్రయత్నమో జరుగుతోంది. కాబట్టి.. పుష్ప 2, దేవర వాయదా పడితే వాటి డేట్, లేదా దీపావళికి రిలీజ్ అంటున్నారు. మరి దీపావళిని గేమ్ ఛేంజర్ టార్గెట్ చేసుకునేలా ఉన్నాడు. అదే నిజమైతే, కల్కి వచ్చేదెప్పుడు..? ఈ సంక్రాంతి మిస్ అయ్యిందని వచ్చే సంక్రాంతికే తెస్తారా..? ఏదైనా ఉగాదికి ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.