KALKI 2898 AD: కల్కి టీజర్.. అమెరికాలో రిలీజ్.. కారణం ఇదే..

ఆమధ్య అమెరికాలో జరిగిన కామిక్ కాన్‌లో గ్లింప్స్ రిలీజ్ చేశారు. స్టార్ కాస్ట్‌ని యూఎస్‌కి తీసుకెళ్లి సందడి చేశారు. ఇప్పుడు మళ్లీ ఛలో యూఎస్ అంటున్నాడు నాగ్ అశ్విన్. కల్కి టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం చేశాడు. దీనికోసం వేదికతోపాటు ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 04:55 PM IST

KALKI 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసేలా చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి 2898 ఏడీ మూవీని గ్లోబల్ సినిమాగా ప్రమోట్ చేయటంలో ముందున్నాడు. ఆమధ్య అమెరికాలో జరిగిన కామిక్ కాన్‌లో గ్లింప్స్ రిలీజ్ చేశారు. స్టార్ కాస్ట్‌ని యూఎస్‌కి తీసుకెళ్లి సందడి చేశారు. ఇప్పుడు మళ్లీ ఛలో యూఎస్ అంటున్నాడు నాగ్ అశ్విన్. కల్కి టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం చేశాడు. దీనికోసం వేదికతోపాటు ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యింది.

MEGASTAR CHIRANJEEVI: పుష్ప తర్వాత.. మెగాస్టార్‌తోనేనా..?

వచ్చే నెల 11నే కల్కి 2898 ఏడీ మూవీ తాలూకు టీజర్ రాబోతోంది. ఇది ఫైనల్ అని తెలుస్తోంది. ఆ రోజునే టీజర్ లాంచ్ చేయటానికి కారణం ఉంది. ఇక యూఎస్‌లోని లాస్ ఎంజిల్స్‌లో టీజర్ లాంచ్ చేస్తున్నారు. అక్కడే ఎందుకంటే.. హాలీవుడ్ మూవీల ప్రోమోలు చాలా వరకు అక్కడే రిలీజ్ అవుతాయి. అక్కడ జరిగే ఫేమస్ ఈవెంట్ అయిన సూపర్ బౌల్ ఈవెంట్‌లో హాలీవుడ్ సినిమాల ట్రైలర్లు లాంచ్ చేయటం కామన్. కల్కి కూడా హాలీవుడ్ మూవీలా వరల్డ్ వైడ్‌గా రాబోతున్న సినిమా అని తెలియ చేసేందుకే సూపర్ బౌల్ ఈవెంట్‌లో టీజర్ లాంచ్ చేయబోతున్నారు.

ఇక సూపర్ బౌల్ కొత్త సీజన్ 11న షురూకాబోతోంది. అంటే ఆ రోజే కల్కి టీజర్‌ని టోటల్ టీం లాంచ్ చేసి, గ్లోబల్ మార్కెట్‌లో హైప్ తెచ్చే ప్రయత్నం చేయబోతోందని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.