KALKI 2898 AD: కల్కి మూవీ నుంచి ప్రభాస్ తాలూకు 12 గెటప్స్‌లో రెండు లుక్స్ ఆల్రెడీ లీకయ్యాయని ఫిల్మ్ టీం తలపట్టుకుంది. ఇప్పుడు మరో కొత్త లుక్ తాలూకు విజువల్స్ లీకవ్వటంతో ఎన్ని జాగ్రత్తలు పెంచినా ఫలితం లేకుండా పోతోందని కంగారుపడుతోంది. ఇలాంటి టైంలో ఇది మహాభారతం తర్వాత మొదలై, క్రీస్తు శకం 2898లో ముగిసే కథా ప్రయాణం అన్నాడు నాగ్ అశ్విన్. బేసిగ్గా స్టోరీలైన్ ఏదైనా, అందులో అద్భుతం అనుకున్న ఎలిమెంట్‌ని ఇలా రివీల్ చేయరు.
CHIRANJEEVI: 75 ఏళ్ల వ్యక్తిగా మెగాస్టార్.. అదిరిపోనున్న చిరు సాహసాలు
కాని నాగ్ అశ్విన్ రివీల్ చేశాడు. ప్రభాస్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో వేగంగా అప్‌డేట్స్ ఇచ్చే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక్కడే. ఆ విషయంలో తనని ఫ్యాన్స్ కూడా బాగానే మెచ్చుకుంటున్నారు. కాని నాగ్ అశ్విన్ కల్కి తాలూకు అప్‌డేట్ ఇచ్చాడని సంబరపడాలో, అందులో మెలికవల్ల కంగారు పడాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎలా చూసినా మే 9కి ఈ మూవీ రావటం కష్టంగానే కనిపిస్తోంది. ఫిల్మ్ టీం ఫ్యాన్స్‌కి హ్యాండ్ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే 15 రోజుల పెండింగ్ వర్క్, క్లైమాక్స్ షూట్, దాని గ్రాఫిక్స్ వర్క్ చూస్తుంటే, ఊరించి ఊరించి చివరికి మే 9 నుంచి మూవీని వాయిదా వేసే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది.
హెవీ గ్రాఫిక్స్ వర్క్ అవసరమున్న ఈ మూవీ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ 50 శాతమే పూర్తైందట. మరో రెండు నెలల్లో మిగతా 50శాతం గ్రాఫిక్ వర్క్ పూర్తవటం అసాధ్యం. కాబట్టి మే 9 నుంచి మెల్లిగా దసరాకు వాయిదా వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఇలా అప్‌డేట్లిచ్చి ఫ్యాన్స్‌ని కూల్ చేస్తున్నారనే ప్రచారం పెరిగింది.