కల్కీ, దేవరకి ట్రోలింగ్ ఉన్నా, సపోర్ట్ దక్కింది.. పుష్ప2 కి మిస్ ఎందుకు..?

రెబల్ స్టార్ కల్కీ మూవీ మీద భారీ ఎత్తున రిలీజ్ కిముందు ట్రోలింగ్ జరిగింది. కల్కీ విడుదలయ్యాక, రికార్డులు క్రియేట్ చేశాక కూడా ట్రోలింగ్ ఆగలేదు. ఓటీటీలో కల్కీ దుమ్ముదులిపే టైంలో కూడా కామెంట్ల ఎటాక్ ఆగలేదు. ఐనా కామన్ ఆడియన్స్ లో మెజారిటీ కల్కీ వెనకే ఉన్నారు.

  • Written By:
  • Publish Date - November 21, 2024 / 06:25 PM IST

రెబల్ స్టార్ కల్కీ మూవీ మీద భారీ ఎత్తున రిలీజ్ కిముందు ట్రోలింగ్ జరిగింది. కల్కీ విడుదలయ్యాక, రికార్డులు క్రియేట్ చేశాక కూడా ట్రోలింగ్ ఆగలేదు. ఓటీటీలో కల్కీ దుమ్ముదులిపే టైంలో కూడా కామెంట్ల ఎటాక్ ఆగలేదు. ఐనా కామన్ ఆడియన్స్ లో మెజారిటీ కల్కీ వెనకే ఉన్నారు. రెబల్ స్టార్ కే ఫిదా అయ్యాడు. అచ్చంగా దేవరకి అదే జరిగింది. దేవర విడుదలకు ముందు, థియేటర్స్ లో దుమ్ముదులుపుతున్న టైంలో, ఓటీటీలో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబడుతున్నప్పుడు ఇలా అన్నీ సందర్భాల్లో ట్రోలింగ్ చేశారు. అయినా దేవర తట్టుకుని రికార్డులను క్రియేట్ చేశాడు.. అయతే మెజారిటీ ఆడియన్స్ దేవర వెనకుండటం వల్లే, మాస్ మతిపోగొట్టడం వల్లే ఇలా జరిగింది. సో పుష్ప కూడా ట్రోలింగ్ కి గురైనా జనం సపోర్ట్ చేశారు. ఇప్పుడు పుష్ప2 కి కూడా ట్రోలింగ్ కనిపిస్తోంది.. కాని ఎందుకో పుష్ప రేంజ్ లో పుష్ప2 మీద మెజారిటీ జనాల్లో సానుబూతి తగ్గింది.. ఎందుకు?

కల్కీ మూవీ రిలీజ్ కిముందు, విడుదలయ్యాక, ఎంత ట్రోలింగ్ కి గురైందో చూశాం. రెబల్ స్టార్ ప్రభాస్ మీద కుళ్లు కుతంత్రాలు, ఫలితంగా బురద చల్లడం లాంటి ప్రయత్నాలు ఎంతగా జరిగాయో, వాటికి ఫ్యాన్స్ ఇచ్చిన కౌంటర్స్ కూడా చూశాం. కట్ చేస్తే, పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, జనాల్లో ఉన్న మంచి అభిప్రాయం వల్ల , కల్కీ టీం కి కావాల్సినంత మోరల్ సపోర్ట్ దొరికింది

ఇక దేవర విషయానికొస్తే, దేవరని అనని మాటల్లేవు… నార్త్ ఇండియా లో అయితే ఇది ప్లాప్ అంటూ ప్రచారం చేశారు. ఎక్కడైతే అంతగా నెగెటీవ్ ప్రచారం జరిగిందో, అక్కడే సౌత్ కంటే రెండింతలు ఎక్కువే వసూళ్లు రాబట్టింది దేవర మూవీ..

దీనికి సాలిడ్ కారణం ఉంది. మాస్ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్, నార్త్ ఇండియాలో తనకి పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల దేవర మీద కామన్ ఆడియన్స్ లో సానుభూతి, సానుకూలత కనిపించాయి.

అవే పుష్పరాజ్ విషయంలో మిస్ అవుతున్నాయా? డెఫినెట్ గా పుష్ప2 మీద నార్త్ ఆడియన్స్ కి చాలా ఇంట్రస్ట్ ఉంది. అందులో డౌట్ లేదు. సుకుమార్ అలాంటి క్యారెక్టరైజేషన్స్ తో చాలా పాత్రలతో సినిమాను ఇంట్రస్టింగ్ గానే మలిచాడు. కాకపోతే, హీరో పాత్రే కాస్త అతితో ఉందనే కామెంట్లు వచ్చాయి కాని,మిగతా పాత్రలన్నీ పర్ఫెక్ట్ సింకయ్యాన్నారు

అలా ఓవర్ కాన్ఫిడెంట్ రోల్ లో హీరో కనిపించటం మీద కామెంట్లు ఎలా ఉన్నా, కాసలు వర్షం మాత్రం కురసింది.కాని పార్ట్ 2 కి ఆ పరిస్థితి ఉంటుందా అనేదే డౌటు… మొదటి పార్ట్ చూసిన జనం సీక్వెల్ చూడటం కామన్. కాని అదేంటో పుష్ప 2 ట్రైలర్ కి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, అంతకు రెండింతలు ట్రోలింగ్ జరుగుతోంది..

ఇలా కల్కీ, దేవరకి కూడా ట్రోలింగ్ జరిగింది. కాని మెజారిటీ జనం ప్రభాస్, ఎన్టీఆర్ మూవీలకు సపోర్ట్ గా నిలిచారు.. అలాంటి సానుభూతే పుష్ప2 కి మిస్ అవుతోంది. కారణం ఏంటో మాత్రం తేలట్లేదు..