Kalki : కల్కి ఆ ఏరియాలో అన్ని కోట్ల‌ భారీ డీల్..

పాన్ ఇండియా (Pan India) రెబ‌ల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ క్రేజ్ స్కై హైగా దూసుకుపోతోంది. రీసెంట్‌గా స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో ప్ర‌భాస్ (Prabhas) క‌టౌట్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. దీంతో.. ఈ డైనోసార్ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. ఇప్పుడు ప్ర‌భాస్ నెక్స్ట్ మూవీ కల్కి 2898 ఏడీపై (Kalki 2898 AD) హై ఎక్స్‌పెక్టేష‌న్స్ఉన్నాయి.

పాన్ ఇండియా (Pan India) రెబ‌ల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ క్రేజ్ స్కై హైగా దూసుకుపోతోంది. రీసెంట్‌గా స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో ప్ర‌భాస్ (Prabhas) క‌టౌట్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. దీంతో.. ఈ డైనోసార్ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. ఇప్పుడు ప్ర‌భాస్ నెక్స్ట్ మూవీ కల్కి 2898 ఏడీపై (Kalki 2898 AD) హై ఎక్స్‌పెక్టేష‌న్స్ఉన్నాయి. ఈ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌కు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకుడు. వైజయంతి మూవీస్ పతాకంపై సీ అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి రీసెంట్‌గా ఓ సాలిడ్ బ‌జ్ వినిపిస్తోంది.

సలార్ మూవీతో తన అసలైన స్టామినా ఏమిటో రుచి చూపించిన ప్రభాస్.. ఇప్పుడు ఇండియన్‌ మార్కెట్‌పై ఫుల్‌ ఫోకస్ పెట్టాడు.. దానికి త‌గ్గ‌ట్లుగానే క‌ల్కి 2898 కూడా తెర‌కెక్కుతోంది. అవెంజర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోంది ఈ సైంటిఫిక్ థ్రిల్లర్.. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ హాలీవుడ్‌ (Hollywood) స్థాయికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు. ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు త‌గ్గ‌ట్లుగానే ఈ మూవీ ఇప్ప‌టికే జస్ట్ ఓటిటి హక్కులతోనే సగం బడ్జెట్ మేర అందుకోగా ఇప్పుడు థియేట్రికల్ గా కూడా భారీ లెవెల్లో బిజినెస్ ని ఈ చిత్రం చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

క‌ల్కి 2898కి సంబంధించి ఒక్క నైజాం ఏరియాలోనే భారీ మొత్తంలో కోట్లకి పైగా హక్కులు అమ్ముడుపోయినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇంత భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చెల్లించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.. దీని ప్ర‌కారం ఒక్క నైజాంలోనే ప‌రిస్థితి ఇలా ఉంటే.. టోట‌ల్ తెలుగు రాష్ట్రాల్లో హక్కులు 150 కోట్ల‌కు పైమాటే ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదే నిజ‌మైతే క‌ల్కి రికార్డుల సునామీ ఖాయ‌మంటున్నారు. అయితే వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చూడాలి మ‌రి.. వైజ‌యంతి మూవీస్ అత్యంత ప్రెస్టీజియ‌స్‌గా తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మ‌రి..