బాహుబలి2 తర్వాత ప్రభాస్ సినిమాల కౌంట్ పెరిగింది కానీ, హిట్ లిస్ట్ పెరగలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కోట్టేశాయి. కానీ సలార్ సినిమా మాత్రం ప్రభాస్‌కు కంబ్యాక్ ఫిల్మ్ అయింది. ఈ సినిమా మాసివ్ హిట్ అయినప్పటికీ.. ఆశించిన స్థాయిలో వసూళ్లను అందుకోలేకపోయింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కాలేదని చెప్పుకొచ్చారు. కానీ లేటెస్ట్‌గా వచ్చిన కల్కి మాత్రం బాహుబలి తర్వాత క్లీన్ హిట్‌గా నిలిచింది.
ఇప్పటికే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గేట్ రీచ్ అయిన కల్కి.. పది రోజులు కాకముందే.. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువైంది. నైజాంలో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 242కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అటు తమిళంలో 24 కోట్లు, బాలీవుడ్‌లో 164 కోట్లు రాబట్టింది. మలయాళంలో 15 కోట్లు వసూలు చేయగా, కన్నడ ఇండస్ట్రీలో 25 కోట్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ గత చిత్ర చిత్రాల రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఓవర్సీస్ పరంగా చూస్తే.. నార్త్ అమెరికాలో 14.5 మిలియన్ డాలర్స్ గ్రాస్‌తో ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నమోదు చేసింది కల్కి.
మొత్తంగా 9 రోజుల్లో 800 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది కల్కి. ఈ కలెక్షన్లతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ సాధించి, క్లీన్ హిట్ సాధించింది. ఇప్పుడు మళ్లీ వీకెండ్ రావడంతో.. వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా బాహుబలి2 తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది కల్కి. ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.