కల్కీ రికార్డులతో.. హిందీ వాళ్లకు అది కూడా మిగలట్లేదా..?

  • Written By:
  • Publish Date - August 6, 2024 / 09:41 PM IST

బాలీవుడ్ లో హిందీ హీరోల డామినేషన్ కామన్. టాలీవుడ్ లో తెలుగు స్టార్ హల్చ్ ఉండటం కామన్. కాని కథ అడ్డం తిరిగింది. హిందీలో రికార్డులన్నీ తెలుగు హీరోలవే.. ముఖ్యంగా పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ వల్లే హిందీ వాళ్లకు అక్కడ ఉండాల్సిన రికార్డులన్నీ ఎగిరిపోతున్నాయి

టాలీవుడ్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా ఏది అంటే, మన మూవీలు కాకుండా ఏ దంగలో, జవానో పేరు చెబితే మనకెలా అనిపిస్తుంది… అచ్చంగా అలాంటి పరిస్థితే బాలీవుడ్ కి ఎదురైంది. ఎందుకంటే తెలుగు సినిమాలు టాలీవు్డ లోనేకాదు, బాలీవుడ్ లో కూడా హయ్యెస్ట్ కలెక్సన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ లో చేరి, టాప్ ప్లేస్ లో దూసుకెళుతున్నాయి

వాళ్ల ఏరియాలో ఎక్కువ వసూళ్ల రాబట్టిన సినిమాలు మనదైతే ఆ కిక్కే వేరు. విచిత్రం ఏంటంటే బాహుబలి 2 నే హిందీలో హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన మూవీగా కొనసాగింది. దానికి కొంతదూరంలో కల్కీ ఉంది.
హిందీ మార్కెట్ పరిదిలో ఎక్కువ వసూళ్లు రాబట్టని మూవీల లిస్ట్ చూస్తే, బాహుబలి 2 మూవీ 792 కోట్లు కేవలం హిందీ మార్కెట్లోనే రాబట్టింది. నెంబర్ వన్ గా ఉంది. ఇక 640 కోట్ల వసూళ్ల రికార్డుతో నెంబర్ 2 లో ఉంది షారుఖ్ ఖాన్ మూవీ జవాన్… ఆతర్వాత కల్కీ 639. 70 కోట్ల వసూళ్లు రాబట్టి, జవాన్ రికార్డు బద్దలు కొట్టే పనిలో ఉంది. హిందీలో ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి, అక్కడ ఇంకా కల్కీ జోరు కంటిన్యూ అవ్వొచ్చు.

సో బాహుబలి 2 రికార్డుని హిందీ మార్కెట్ లో ఎవరైనా బద్దలు కొట్టే సీన్ ఉందంటే అది ప్రభాసే.. తనకు తానే పోటీ కాబట్టి తన రికార్డులు తానే బద్దలు కొట్టగలడని ప్రూవ్ అవుతోంది. ఏదేమైనా మరో 55 లక్షలు కల్కీ కి హిందీలో వసూళ్లు వస్తే, బాలీవుడ్ లో కూడా భారీగా వసూళ్లు రాబట్టిన సినిమాలేవి అంటే,ఆ టాప్ 2 మూవీస్ తెలుగువే అనాల్సి వస్తుంది…ఇది విని తట్టుకోవటం బాలీవుడ్ స్టార్లకు చాలా కష్టం.. అసలే సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు వాళ్ల డామినేషన్ వాళ్లు భరించలేకపోతున్నారు. అలాంటిది తెలుగు హీరో ప్రభాస్ సినిమాలే బాలీవుడ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీలంటే, ఇప్పుడు వాళ్లకి పుండు మీద కారం చల్లినట్టే అవుతుంది.