ఆస్కార్ రేసులో కల్కీ… ఆ కేటగిరీలో నామినేషన్ పక్కా…

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ మూవీ భాక్సాఫీస్ లో 1195 కోట్లు రాబట్టి, ఓటీటీలో మిలియన్ల కొద్ద వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు అవార్డుల వంతొచ్చినట్టుంది. ఏకంగా ఆస్కారు రేసులో నిలబడుతోంది ఈ పాన్ ఇండియా మూవీ. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీ తో పాటు, గ్రాఫిక్స్ కేటగిరీలో కల్కీ ఆస్కార్ రేసులో నిలబడబోతోంది.

  • Written By:
  • Updated On - September 23, 2024 / 06:06 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ మూవీ భాక్సాఫీస్ లో 1195 కోట్లు రాబట్టి, ఓటీటీలో మిలియన్ల కొద్ద వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు అవార్డుల వంతొచ్చినట్టుంది. ఏకంగా ఆస్కారు రేసులో నిలబడుతోంది ఈ పాన్ ఇండియా మూవీ. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీ తో పాటు, గ్రాఫిక్స్ కేటగిరీలో కల్కీ ఆస్కార్ రేసులో నిలబడబోతోంది. ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీ లాపతా లేడీస్ అని ఎనౌన్స్ చేశారు. అయినా ప్రైవేట్ గా కల్కీ, హనుమాన్ మూవీలు ఆస్కార్ నామినేషన్ కి పంపించినట్టు తెలుస్తోంది. ఇందులో కల్కీ రెండు కేటగిరీల్లో ఆస్కార్ నామినేషన్ పక్క అంటున్నారు? అవేంటివి?

రెబల్ స్టార్ మూవీ కల్కీ సినిమాకు ఆస్కార్ వస్తే ఎలాఉంటుంది.. హిందీ మూవీ లాపతా లేడీస్ ని ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అఫీషియన్ ఎంట్రీగా పంపిస్తే, కల్కీకి అవార్డు ఎలా వస్తుంది.. ఇది కామన్ డౌట్.. ఐతే లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశారు. గుజరాతీ సినిమాకు ఇలానే అఫీషియల్ ఎంట్రీగా పంపిస్తే, ప్రైవేట్ గా త్రిబుల్ ఆర్ టీం నామినేషన్ కి ఈ మూవీని పంపింది..

కట్ చేస్లే బెస్ట్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకి ఆస్కార్ అందుకుంది త్రిబుల్ ఆర్ టీం. కీరవాణి, చంద్రబోస్ ఇందరు కంబైండ్ గా నాటు పాటకి ఆస్కార్ అందుకున్నారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరుగుతోంది.1195 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి, ఓటీటీలో కూడా వ్యూస్తో దుమ్ముదులుపుతున్న కల్కీకి, ఆస్కార్ గ్యారెంటీలా కనిపిస్తోంది

దానికి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కల్కీ గ్రాఫిక్స్ విభాగం, అలానే సౌండ్ ఎడిటింగ్ హాలీవుడ్ కి పోటీ ఇచ్చేలా ఉండటంతో, ఆ కేటగిరీల్లో ఈసినిమా నామినేట్ అయ్యేలా ఉందట. మరో తెలుగు మూవీ హనుమాన్ కూడా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ రేసులో ఉండే అవకాశం ఉంది.

ఏదేమైనా ఒకప్పడు తెలుగు సినిమానే నార్త్ జనం పట్టించుకోని స్టేజ్ నుంచి బాలీవుడ్ ని డామినేట్ చేస్తూ, హాలీవుడ్ లో ఏకంగా ఆస్కార్లు సొంతం చేసుకునే స్టేజ్ కి వెళ్లింది టాలీవుడ్. అలా త్రిబుల్ ఆర్ కి మొదటి ఆస్కార్ వస్తే, కల్కీకి రెండో అవార్డు అనంటున్నారు. బెస్ట్ ఫీచర్ మూవీలో ఆర్ట్ సినిమాలకే ప్రయారిటీ ఎక్కువ కాబట్టి, ఈ కమర్శియల్ మైథలాజికల్ మూవీకి, సౌండ్ ఎడిటింగ్, గ్రాఫిక్స్ విభాగంలో నామినేషన్ కా 90 శాతానికి మించే అవకాశాలున్నాయి. రెండు కేటగిరిల్లో నామినేట్ అయితే మాత్రం కనీసం ఒక కేటగిరీలో అయినా అవార్డు రావటం ఖాయం. అదేజరిగితే, టాలీవుడ్ రేంజ్ ని హాలీవుడ్ కి తీసుకెళ్లిన రెబల్ స్టార్ గా ప్రభాస్ పాన్ వరల్డ్ హీరోగా కొంతవరకు పాతుకుపోయినట్టే.