తెలుగు చిత్రసీమలో (Tollywood) ప్రఖ్యాత నిర్మాణసంస్థలుగా వెలుగు చూసిన వాటిలో ‘వైజయంతీ (Vyjayanti) మూవీస్’ స్థానం ప్రత్యేకమైనది. ఈ సంస్థ అధినేత అశ్వనీదత్ చిత్రసీమలో ఎంతటి ప్రముఖ స్థానం సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్టీఆర్ అభిమానిగా ఆయనతోనే ‘ఎదురులేని మనిషి’ చిత్రం నిర్మించి, తమ వైజయంతీ మూవీస్ కు శ్రీకారం చుట్టారు అశ్వనీదత్. తరువాత నాటి టాప్ స్టార్స్ తోనూ తరువాతి తరం అగ్రకథానాయకులతోనూ ఎన్నో గోల్డెన్ హిట్స్ అందించారు.
ప్రస్తుతం ఆయన కూతుళ్ళు చిత్రనిర్మాణంలో ఉన్నారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) తో ఎవడే సుబ్రహ్మణ్యం (Subrahmanyam), మహానటి సినిమాలని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ లలో అశ్వినీదత్ అతని కుమార్తె స్వప్నదత్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు వైజయంతీ మూవీస్ కి లాభాలతో పాటు అవార్డులు కూడా తెచ్చి పెట్టాయి. ఇప్పుడు కల్కి 2898ఏడీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా.. 2015లో నాగ్ అశ్విన్ అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకదత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక.. బయటి నుంచి ఆఫర్స్ వచ్చిన కూడా నాగ్ అశ్విన్ ఎవరికి మూవీస్ చేయడం లేదు.. ఇదంతా చూస్తుంటే.. మామయ్య ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ వైజయంతీని మరో లెవెల్ కు తీసుకు వెళ్లే బాధ్యతను తనే తీసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే.. ప్రస్తుతం వైజయంతి మూవీస్‌పై ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2898AD చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి నాగ్ అశ్విన్ రెమ్యూనరేషన్‌పై వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ డ్రామా తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ‘మహానటి’ లాంటి భారీ హిట్ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ విజన్, మేకింగ్‌పై మూవీ లవర్స్‌లో రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించే పనిలో ఉన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పార్ట్ 1 త్వరలో విడుదల కానుంది.. అందుకు తగ్గేట్టే భారీ తారాగణం కల్కిలో భాగమైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ బజ్ పెంచుతున్నాయి.
ఇక ఈ మూవీలోని నటీనటుల రెమ్యూనరేషన్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.. హీరో ప్రభాస్ – అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె అలాగే స్టార్ క్యాస్ట్, టెక్నీషియన్స్ కు కలిపి 250 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక.. కల్కి మూవీ రెండు పార్టులకు గాను నాగ్ అశ్విన్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది..
అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ కోసం అశ్వినీ దత్ అల్లుడికి ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదంట. సినిమా లాభాల్లో వాటా ఇచ్చేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ ప్రకారం నాగ్ అశ్విన్ కి కల్కి 2898ఏడీ (Kalki 2898 AD) చిత్రం ద్వారా 50 కోట్లకు పైగానే ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బిజినెస్ పెరిగి మరింత లాభాలు వస్తే నాగ్ అశ్విన్ కి మూవీ ద్వారా వచ్చే ప్రాఫిట్ కూడా పెరగనున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాజమౌళి తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకోబోతున్న డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కూడా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.. సో.. మొత్తానికి కల్కి మూవీ ద్వారా నాగ్ అశ్విన్‌కి భారీగానే లాభం చేకూరుతుందన్నమాట.. మరి.. అల్లుడా మజాకానా ..