Kalki : కల్కి’ నైజాం డీల్ క్లోజ్.. వారికే రైట్స్

సమ్మర్‌ (Summer) లో మే 9న రావాల్సిన కల్కి 2898ఏడి (Kalki 2898AD) సినిమా, జూన్ 27కి వాయిదా పడింది. కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్‌ లుక్ కంటే.. లేటెస్ట్ లుక్ అదిరిపోయింంది. ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా నాలుగైదు గెటప్‌లలో కనిపించనున్నట్టుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది.

సమ్మర్‌ (Summer) లో మే 9న రావాల్సిన కల్కి 2898ఏడి (Kalki 2898AD) సినిమా, జూన్ 27కి వాయిదా పడింది. కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్‌ లుక్ కంటే.. లేటెస్ట్ లుక్ అదిరిపోయింంది. ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా నాలుగైదు గెటప్‌లలో కనిపించనున్నట్టుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ కల్కి అవతారము మాత్రం మామూలుగా ఉండదట. ప్రభాస్ (Prabhas) దెబ్బకు మరో రెండు నెలల్లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర మొదలు కాబోతోంది.

కరెక్ట్‌గా చెప్పాలంటే సంక్రాంతి తర్వాత మరో పెద్ద సినిమా థియేటర్లోకి రాలేదు. సమ్మర్ సీజన్ బాక్సాఫీస్ దాహంతో ఉంది. దీంతో.. కల్కి డే వన్ ఊహించని ఓపెనింగ్స్ రాబడుంతుందని.. ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఖచ్చితంగా ఈ సినిమా ఇంతకు ముందున్న రికార్డులన్నీ చెరిపిస్తుందని అంటున్నారు. కల్కికి సాలిడ్ హిట్ టాక్ పడితే బాహుబలి 2 రికార్డ్స్‌ను టార్గెట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు.

వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) నిర్మిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కల్కి నైజాం (Nizam) ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ లాక్ అయ్యారు. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు తెలిసింది. అయితే.. ఎంతకు ఈ రైట్స్ దక్కించుకున్నారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఇలాంటి వివరాలు బయటికి రానున్నాయి.