కల్కి మూవీ కొత్త రికార్డు క్రియట్ చేస్తోంది. వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ.. ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ యాక్టింగ్.. నాగి స్టోరీ టెల్లింగ్‌కు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు. నాగి సినిమాటికి యూనివర్స్‌కు ట్రైలర్‌లాంటి ఫస్ట్ పార్ట్.. అభిమానుల మనసులను కొల్లగొట్టేసింది. హిందు పురాణాలను.. భవిష్యత్ ఇతివృత్తాలతో కలిపి రాసుకున్న కథతో ఈ మూవీ సాగింది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవ నాశనాన్ని కోరుకుని కృష్ణుడి మీదే యుద్ధానికి దిగుతాడు అశ్వద్ధామ. ఐతే ఆ యుద్ధంలో ఓడిపోయి.. కృష్ణుడి నుంచి శాపం పొందుతాడు. లోకంలో జరిగే దుర్మార్గాలు చూస్తూ కలియుగం వరకు బతికి ఉంటారు. కలియుగం అంతంలో తాను పుడతానని.. అప్పుడు తనని అతనే రక్షించాలని అశ్వత్థామకు చెప్తాడు కృష్ణుడు. ఆరు వేల సంవత్సరాల తర్వాత ప్రపంచంలోకెల్లా విలాసవంతమైన కాంప్లెక్స్‌లో అడుగు పెట్టేందుకు.. యూనిట్స్ కోసం ఏవేవో పనులు చేస్తుంటాడు ప్రభాస్. మరోపక్క సమస్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న యాస్కిన్ తన మనుషుల ద్వారా.. అరుదైన గర్భాన్ని మోస్తున్న సుమతి కోసం వెతుకుతుంటాడు. చివరికి వీరందరూ శంబళలో కలిసే పరిస్థితి వస్తుంది. దీనికి ముందు తర్వాత జరిగేది అసలు స్టోరీ. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపికా, యాస్కిన్‌గా కమల్, అశ్వత్థామగా అమితాబ్ అదుర్స్ అనిపించారు. ఐతే ఈ పాత్రలకు శంభలా నగరానికి లింక్ ఉంటుంది. దీంతో అసలు శంభల ఏంటి.. దాని కథ ఏంటి.. అది నిజంగా ఉందా అని వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు. కల్కి పురాణం ప్రకారం.. కల్కి అవతారం శంబళలో ప్రాణం పోసుకుంటుంది. కలియుగ అంతంలో శంబళ నగరంలో కల్కి జన్మించడంతో.. ఆ ప్రదేశం రూపురేఖలు మారిపోయి ఉంటాయి. సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా అహ్లాదకరంగా.. ఆ ప్రదేశం మారిపోతుంది. పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కీ అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ క్రమంలో దేవతలు శంబళకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. ఇదంతా ముగిసిన తర్వాత కల్కి తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబళ అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. ఇంత కథ ఉన్న ఈ ప్రదేశం గురించి నాగ్ అశ్విన్ కలిగే సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారు.