Kalki : ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

కల్కి 2898 ఏడీ సినిమా కోసం సినీ ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. భారీ బడ్జెట్‍తో గ్రాండ్ లెవెల్ గ్రాఫిక్స్‌తో పురాణాల ఆధారంగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై అంచనాలు స్కైహైని తాకుతున్నాయి.

 

 

కల్కి 2898 ఏడీ సినిమా కోసం సినీ ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. భారీ బడ్జెట్‍తో గ్రాండ్ లెవెల్ గ్రాఫిక్స్‌తో పురాణాల ఆధారంగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై అంచనాలు స్కైహైని తాకుతున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లను విడుదల చేస్తూ ప్రేక్షకులలో అంచనాలను సృష్టిస్తున్నాడు. మేకర్స్ ఇటీవల బుజ్జి అనే క్యారెక్టర్‌ని రివీల్ చేశారు. ఈ ప్రోమోకు విశేష స్పందన రావడంతో.. ట్రైలర్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దీంతో.. మూవీ టీమ్ మూవీటీమ్ ట్రైలర్​పై మరింత దృష్టి సారించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్​ నాగ్ అశ్విన్ ట్రైలర్​ను డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక.. డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కల్కి ట్రైలర్‌కు సంబంధించి ఓ లేటెస్ట్ బజ్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ రిలీజ్​కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది..

కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ కాస్త మిగిలే ఉందంటూ కొంతకాలంగా వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఎప్పుడూ పూర్తిగా అయిపోతుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిందని సమాచారం బయటికి వచ్చింది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నట్లు ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూన్​ నెల తొలి వారంలో గ్రాండ్​గా ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

దీనిపై మూవీటీమ్ నుంచి త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో.. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ సైతం పండగ చేసుకుంటున్నారు. కల్కి మూవీని.. 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత హై బడ్జెట్‌తో నిర్మించిన మొట్టమొదటి ఇండియన్‌ ఫిల్మ్‌గా కల్కి రికార్డు సృష్టించింది. నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వైజతంతి మూవీస్ బ్యానప్ చేసింది. కల్కి 2898లో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఎందరో సీనియర్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొన్న ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో చూడాల్సిందే..