పాన్ ఇండియా లెవెల్ లో… దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అమరన్ సినిమా సూపర్ హిట్ అయింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఓ ఆర్మీ అధికారి జీవితంలో ఉండే ప్రేమ, కుటుంబం, యుద్ద సన్నివేశాలు, అతని కుటుంబ పరిస్థితి ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. శివ కార్తికేయన్ లో ఆడియన్స్ కొత్త కోణం చూసారు.
300 కోట్ల వసూళ్లు దాటి పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము రేపింది సినిమా. ‘అమరన్’ మన దేశంలో 22 రోజుల్లో రూ. 198.10 కోట్లు వసూలు చేసింది. 22 వ రోజు కూడా ఈ సినిమా డామినేషన్ నడిచింది. రూ. 1.65 కోట్లు వసూలు చేసింది. అమరన్ అక్టోబర్ 31 న థియేటర్లలో విడుదలైంది. 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. విడుదలై మూడు వారాలు గడిచినా ఇంకా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. నవంబర్ 19 అంటే… మంగళవారం నాటికి అమరన్ రూ. 2.10 కోట్లను ఆర్జించింది.
1వ వారం రూ. 114.85 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా… 2వ వారం రూ. 57.25 కోట్లు వసూలు చేసింది. 16వ రోజు రూ. 3.6 కోట్లు వసూలు చేయగా 17వ రోజు రూ. 6.15 కోట్లు వసూలు చేసినట్టు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. ఇక 18వ రోజు వసూళ్లు భారీగా వచ్చాయి. రూ. 8 కోట్లు వసూలు చేసింది. విడుదలైన 18 వ రోజు అలా వసూలు చేయడం అంటే సినిమా సక్సెస్ ఏ రేంజ్ లో ఉందో చెప్పవచ్చు. ఇక 19వ రోజు రూ. 2.50 కోట్లు వసూలు చేయగా 20వ రోజు: రూ. 2.10 కోట్లు వసూలు చేసింది. మొత్తం ఇండియా వైడ్ గా రూ. 194.40 కోట్లు వసూలు చేసింది.
బయోగ్రాఫికల్ వార్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా కథను… శివ అరూర్, రాహుల్ సింగ్ రచించగా… రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా సక్సెస్ కావడంతో కమల్ హాసన్ అప్పులు అన్నీ ఒక్క దెబ్బకు లేచిపోయాయి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్ళుగా కమల్ హాసన్ అప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో వేసిన ఈ స్టెప్ ఆయనకు మంచి సక్సెస్ ఇచ్చింది. దీనితో చిత్ర యూనిట్ కు వ్యక్తిగతంగా ఆయన… గిఫ్ట్ లు కూడా ఇస్తున్నారు.