KAMAL HAASAN: కమల్ హాసన్‌కి ఎన్టీఆర్ సాయం..

మేలో కల్కి, జూన్, జులైలలో వరుసగా ఓజీ, గేమ్ ఛేంజర్, పుష్ప 2 అంటూ దసరా వరకు చాలా సినిమాలతో పోటీ ఉంది. డిసెంబర్‌లో రాజాసాబ్ వస్తే, ఈ ఏడాదంతా భారతీయుడు 2కి ఇబ్బందే అన్నారు. కానీ ఏప్రిల్ 5న రావాల్సిన దేవర వాయిదా పడితే ఆ సీజన్‌లో పోటీ ఉండదు.

  • Written By:
  • Publish Date - January 25, 2024 / 05:55 PM IST

KAMAL HAASAN: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు లోకనాయకుడికే సాయం చేస్తున్నాడా అంటే.. అవునని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఏప్రిల్ 5న విడుదలవ్వాల్సిన దేవర మూవీ దసరాకు వాయిదా పడేలా ఉంది. అదే జరిగితే భారతీయుడు 2 మూవీకి పంట పండినట్టే. ఎందుకంటే ఆ ముహుర్తాన్ని కబ్జా చేసేందుకు భారతీయుడు 2 టీం రెడీ అయ్యింది. మేలో కల్కి, జూన్, జులైలలో వరుసగా ఓజీ, గేమ్ ఛేంజర్, పుష్ప 2 అంటూ దసరా వరకు చాలా సినిమాలతో పోటీ ఉంది.

RAM CHARAN: రంగస్థలంలో మళ్లీ అడుగు పెట్టనున్న రామ్ చరణ్

డిసెంబర్‌లో రాజాసాబ్ వస్తే, ఈ ఏడాదంతా భారతీయుడు 2కి ఇబ్బందే అన్నారు. కానీ ఏప్రిల్ 5న రావాల్సిన దేవర వాయిదా పడితే ఆ సీజన్‌లో పోటీ ఉండదు. తమిళ్‌‌లో కూడా సూర్య పాన్ ఇండియా మూవీ కంగువా వాయిదా పడింది. కాబట్టి ఏప్రిల్‌లో సౌత్, నార్త్, అంతటా పెద్దగా కాంపిటీషన్ ఉండేలా లేదు. అందుకే ఆ డేట్‌కి భారతీయుడు 2ని విడుదల చేయాలనుకుంటున్నారట. అలా దేవర వల్ల భారతీయుడు 2 పంట పండేలా ఉంది. భారతీయుడు 2 మూవీని శంకర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాతికేళ్లక్రితం వచ్చిన భారతీయుడు మూవీకి ఈ సినిమా సీక్వెల్‌గా రూపొందుతోంది.

రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే.. అదే ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్‌‌తో పాటు పలు తెలుగు సినిమాలు విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదంతా దేవర వాయిదాపై ఆధారపడి ఉంటుంది.