Indian 2: కల్కి 2898 ఏడీ మూవీ మే 9న రాబోతోంది. ఇది రావటానికి నెల రోజుల ముందు.. అంటే ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ మూవీ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాబోతోంది. రెండీంటికి మధ్య నెల గ్యాప్ ఉంది కాబట్టి ఫ్యామిలీ స్టార్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు. కాని ఈ సమ్మర్‌నే టార్గెట్ చేసిన లోకనాయకుడు కమల్ హాసన్‌కి మాత్రం వేసవి అంత ఈజీ కాదు. ఎందుకంటే మే 9న కల్కి 2898 ఏడీ మూవీ రాబోతోంది. అదే రోజు ప్లాన్ చేసిన భారతీయుడు 2 రిలీజైతే, వసూళ్ల వరదకి కోత పడే ఛాన్స్ ఉంది.
Taapsee Pannu: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. పెళ్లెప్పుడంటే..!
రెబల్ స్టార్‌కి ఉన్న మాస్ ఇమేజ్, పాన్ ఇండియా క్రేజ్ వల్ల కల్కికి వచ్చిన నష్టం ఏమీలేదు. ఎటొచ్చీ భారతీయుడు సీక్వెల్‌కే సౌత్, నార్త్‌లో పంచ్ పడేలా ఛాన్స్ ఉంది. అందుకే కమల్ హాసన్ కూడా రెండు వారాలు వెనక్కి వెళుతున్నాడు. మే 9న కల్కి వస్తోంది కాబట్టి, రెండు వారాల గ్యాప్‌తో మే 23కి భారతీయుడు 2ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. లేదంటే కల్కి రావటానికి రెండు వారాల ముందు.. అంటే ఏప్రిల్ 25న భారతీయుడు 2ని రిలీజ్ చేస్తారట.
మొత్తానికి మార్చ్ 29కి టిల్లూ స్క్వేర్, ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్, మే 9న రెబల్ స్టార్ నుంచి కల్కి రూపంలో సునామీ కన్ఫామ్ అయ్యాయి. ఇక గ్యాప్ చూసుకుని దూసుకొచ్చేందుకు భారతీయుడు 2 మూవీనే ముహుర్తాల వేటలో పడింది.