Kamal Haasan: కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ ఇండియన్-2. కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేసిన గ్లింప్స్, 2 ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. భారతీయుడును మించి ఇండియన్ 2 ఉండబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
YCP-JANASENA: జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నం.. ప్రశాంత్ కిషోర్ సంచలన వీడియో
27 ఏళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ అయిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా.. ఇంతవరకు పూర్తి కాలేదు.. అయితే త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. 1996 మే 9న విడుదలైన భారతీయుడు చిత్రం ఓ సంచలనం. అదే తేదీన ‘ఇండియన్ 2’ విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ‘కల్కి 2898 AD’ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా, కల్కి సినిమా రిలీజ్ డేట్ ఇది వరకే ఖరారు అయి ఉండటంతో, రెండు చిత్రాల మధ్య క్లాష్ రాకూడదని, రెండు వారాల గ్యాప్ లో ‘ఇండియన్ 2 విడుదల చేయాలి అనుకున్నారు. కానీ.. మేకర్స్ మళ్లీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు మూవీకి అచ్చొచ్చిన మే9నే ఇండియన్-2 కూడా రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్-2 విడుదలకు రంగం సిద్ధం చేశారట మేకర్స్. ఇదే నిజమైతే ఒకేరోజు.. కమల్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయన్న మాట.
భారతీయుడు సినిమాలో వృద్ధ స్వతంత్ర సమరయోధుడిగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పౌరుడిగా కమల్ హాసన్ తన విలక్షనమైన నటనతో భారతీయ సినిమా చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు. ఇప్పుడ ఇండియన్-2లో కమల్ అంతకు మించి అన్నట్లుగా నటిస్తున్నారట. కాగా.. ‘ఇండియన్ 2’ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా 2018లోనే ప్రకటించారు. అజయ్ దేవగన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సిద్ధార్థ్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. మొత్తానికి భారీ తారాగణంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఎండాకాలం సెలవుల్లో సందడి తేబోతోంది. కమల్ హాసన్ అభిమానులకు ఈ చిత్రంతో పాటూ, ‘కల్కి’తోనూ ధమాకా ఇవ్వబోతున్నారన్నమాట.