Kangana Ranaut : కంగనాకు ఇప్పుడు తెలిసొచ్చింది..

ఎంపీగా గెలిచిందో లేదో రాజకీయాలు కష్టమంటోంది కంగన రనౌత్‌. పాలిటిక్స్‌ కంటే సినిమాలే ఈజీ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా.. ఓ ఈవెంట్‌కు హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

 

ఎంపీగా గెలిచిందో లేదో రాజకీయాలు కష్టమంటోంది కంగన రనౌత్‌. పాలిటిక్స్‌ కంటే సినిమాలే ఈజీ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా.. ఓ ఈవెంట్‌కు హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాలిటిక్స్ కంటే సినిమాలే ఈజీనట. కంగన రనౌత్‌ చేతిలో ఎమర్జెన్సీ మూవీతో పాటు మరో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఉన్నాయ్. ఇందిరా గాంధీగా నటించి డైరెక్ట్‌ చేసిన ఎమర్జెన్సీ షూటింగ్‌ పూర్తయింది. ఒప్పుకున్న సినిమా కంప్లీట్‌ కాగానే.. ఇక ప్రజా సేవలో లీనమవుతానని కంగన తెలిపింది. ఓ పాడ్‌కాస్ట్‌ ఈవెంట్‌కు హాజరైన కంగనా… రాజకీయాల నుంచి పిలుపు రావడం తనకు కొత్తేమీ కాదని.. ఫస్ట్‌ మూవీ గ్యాంగ్‌స్టర్‌ రిలీజైన వెంటనే టిక్కెట్‌ ఆఫర్‌ చేశారని చెప్పింది. తన తాత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని.. ఇలా పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టే.. పాలిటిక్స్‌లోకి రమ్మని ఆహ్వానించేవారని చెప్పుకొచ్చింది కంగనా. పాలిటిక్స్‌ అంటే తనకు ఇంట్రెస్ట్ వుంది కాబట్టే వచ్చానంటోంది. తానెప్పుడూ మనసుకు నచ్చిందే చేస్తానని.. సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా రైటర్‌గా వర్క్‌ చేశానని.. రాజకీయాల్లోనూ అలాగే వుంటానని చెప్పుకొచ్చింది. జనాల మధ్యలోకి వెళ్లాలనిపిస్తే వెళ్లిపోతానంటోంది. కంగన ఎంపీగా గెలిచిన పది రోజులకే… రాజకీయం అంటే ఏమిటో బోధపడింది. రాజకీయాల కంటే సినిమాలే ఈజీ అంటోంది. ఎన్ని బాధలున్నా.. సినిమా చూస్తే రిలాక్స్ అవుతామని.. పాలిటిక్స్‌లో అలా కాదని… ఇబ్బందిలో వున్నా డాక్టర్లలా జనాల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండాలని అంటోంది. ఇక గతేడాది అక్టోబర్‌లో రావాల్సిన ఎవర్జెన్సీ జూన్‌ 14కు వాయిదాపడింది. ఎలక్షన్స్‌ కారణంగా మరోసారి వాయిదా వేశారు. ఐతే ఎప్పుడు వచ్చేది అనేది మాత్రం.. ఇంకా చెప్పలేదు.