Rishab Shetty: కాంతార చాప్టర్-1లో 15 మంది స్టార్ హీరోలు.. ఓటీటీలపై రిషబ్ శెట్టి ఫైర్ ..

ఈ మధ్య జరిగిన ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న రిషబ్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమ పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు. కరోనా తర్వాత OTTలు విజృంభించి ఇండస్ట్రీ మార్కెట్ కుప్పకూలిందని.. అయినప్పటికీ కన్నడ సినిమాలకు ఓటీటీలో సరైన ఆదరణ లభించలేదని చెప్పుకొచ్చాడు.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 05:56 PM IST

Rishab Shetty: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాలు దుమ్ములేపుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు సౌత్‌లో తెలుగు, తమిళం ఇండస్ట్రీల డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. మలయాళ, కన్నడ ఇండస్ట్రీలు కూడా బాక్సాఫీస్ రేసులోకి దూసుకొచ్చాయి. ముఖ్యంగా KGF మూవీతో కన్నడ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఒకప్పుడు శాండల్ వుడ్ చాలా కష్టాలు పడింది. ఇప్పటికైనా అవి సమసిపోయాయా అంటే లేదని షాకిచ్చాడు రిషబ్ శెట్టి. కన్నడ ఇండస్ట్రీలో అప్పటి పరిస్థితులు, ఇప్పటికీ కొనసాగుతున్న వివక్ష గురించి కుండబద్దలకొట్టినట్టు మాట్లాడాడు రిషబ్ శెట్టి.

Rajinikanth: సూపర్ స్టార్ క్రేజ్.. రజినీ కోసం యంగ్ హీరో

కన్నడ మూవీస్ కొనేందుకు ఓటీటీలు ముందుకు రావడం లేదన్నాడు. ఈ మధ్య జరిగిన ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న రిషబ్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమ పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు. కరోనా తర్వాత OTTలు విజృంభించి ఇండస్ట్రీ మార్కెట్ కుప్పకూలిందని.. అయినప్పటికీ కన్నడ సినిమాలకు ఓటీటీలో సరైన ఆదరణ లభించలేదని చెప్పుకొచ్చాడు. “ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంలు అన్నీ కన్నడ సినిమాలను విడుదల చేసే వీలు లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. కన్నడ సినిమాలను యాక్సెప్ట్ చేయడానికి టైమ్ తీసుకుంటామని ఓటీటీలు అంటున్నాయి. వారు ఓకే అనే రోజు కోసం ఎదురుచూస్తున్నాం” అని ఇండస్ట్రీ ఇబ్బందులను బయటపెట్టాడు. వాస్తవానికి రిషబ్ ఇలా బయటకు చెప్పేవరకూ కన్నడ ఇండస్ట్రీని ఓటీటీలు చిన్నచూపు చూస్తున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక రిషబ్ మూవీస్ విషయానికొస్తే.. కాంతారతో పాన్ ఇండియా స్టార్ల లిస్ట్‌లో చేరాడు రిషబ్.

ఈ సినిమాలో నటించడమే కాదు కథను అందించి, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కించుకున్న ఈ మూవీకి ప్రీక్వెల్ అయిన ‘కాంతార 1’ షూటింగ్ జరుగుతోంది. రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో బీభత్సం సృష్టించింది. పాన్ ఇండియా రేంజ్‌లో తరెకెక్కిస్తున్న ఈ మూవీలో అందుకు తగ్గట్టే వివిధ భాషలకు చెందిన అగ్రహీరోలను తీసుకుంటున్నట్లు టాక్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా పలు సినిమా పరిశ్రమలకు చెందిన 15 మందికి పైగా నటీనటులను ఎంపిక చేశారట. 2024లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోన్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.