Kantara: Chapter 1: ఉగ్రరూపం.. హాలీవుడ్ రేంజ్‌లో కాంతార-2..

రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల పైన వసూళ్లను రాబట్టి పెద్ద సినిమాలకు ధీటుగా నిలబడింది. ఈ సక్సెస్‌తో కాంతార ప్రీక్వెల్‌గా కాంతార 2 వస్తోంది. ది లెజెండ్ చాప్టర్ 1 అని పెట్టిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌ ఇప్పటికే సెన్సేషన్ సృష్టించింది.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 03:41 PM IST

Kantara: Chapter 1: అద్భుతాలు అన్నిసార్లూ జరగవు. కొన్ని సార్లు అనుకోకుండానే జరిగిపోతుంటాయి. అలాంటి అద్భుతాల్లో కాంతార సినిమా కూడా ఒకటి. చినుకు చినుకు గాలి వాన అయినట్టు.. కన్నడలో చిన్న సినిమాగా మొదలైన కాంతారా మూవీ ఓ ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి.. కన్నడలో రిషబ్ శెట్టి తీసిన కాంతార సినిమా సంచలన విజయం అందుకుంది. రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల పైన వసూళ్లను రాబట్టి పెద్ద సినిమాలకు ధీటుగా నిలబడింది. ఈ సక్సెస్‌తో కాంతార ప్రీక్వెల్‌గా కాంతార 2 వస్తోంది.

Raghava Lawrence: షాకింగ్.. రాఘవ లారెన్స్‌కు భయంకర వ్యాధి

ది లెజెండ్ చాప్టర్ 1 అని పెట్టిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌ ఇప్పటికే సెన్సేషన్ సృష్టించింది. ఈ టీజర్ చూసిన వాళ్లంతా మరోసారి రిషబ్ శెట్టి తన నట ఉగ్రరూపంతో అదరగొట్టేలా ఉన్నాడంటూ ఫిక్సయిపోయారు. అయితే.. కాంతార 2 లెజెండ్ చాప్టర్ 1 టీజర్ చూసిన వారంతా కూడా కాంతార 3కి హింట్ ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. అయితే దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇన్నర్ టాక్. అంతేకాదు ఈ సినిమా కాంతార కన్నా 10 రెట్ల బడ్జెట్‌తో వస్తుంది. కాంతారతో ఏర్పడిన భారీ క్రేజ్‌తో.. సీక్వెల్ సినిమా రూ.200 కోట్ల పైన బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. కథ, కథనాలే కాదు.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.

కాంతార 2 సినిమా మొదటి నుంచే గూస్ బంప్స్‌ తెప్పిస్తుందని మూవీ మేకర్స్ లీక్స్ వదులుతున్నారు. రిషబ్ శెట్టి ఓ పక్క నటిస్తూనే మరోపక్క ఈ సినిమా మేకింగ్ మీద కూడా పర్ఫెక్ట్ ఫోకస్‌తో పనిచేస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ సీక్వెల్‌పై కూడా తెలుగు స్ట్రైట్ సినిమా రేంజ్ అంచనాలు పెరిగిపోయాయి. కాంతార లానే పార్ట్ 2 కూడా ఆడియన్స్‌కి రీచ్ అయి ఏకంగా రూ.1000 కోట్లను వసూలు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు సినీ పండితులు.