బాలీవుడ్ లో ఇప్పుడు సైలెంట్ గా దేవర కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఏ రేంజ్ లో నెగటివ్ టాక్ పెంచినా దేవర జాతర మాత్రం ఆగలేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమైన ఎన్నో రికార్డులను దేవర 20 రోజుల వ్యవధిలో తొక్కుకుంటూ పోయింది. దేవరను టార్గెట్ చేయడానికి బాలీవుడ్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే జాతర మాత్రం విజయవంతం అయిందనే చెప్పాలి. ఇప్పటికే కల్కీ దెబ్బకు బాలీవుడ్ కి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పుడు దేవర కూడా తోడయ్యింది.
ఎన్నో యేండ్ల నుంచి మాదే తెలుగు సినిమాపై పెత్తనం అని విర్రవీగుతున్న బాలీవుడ్ కోరలు ఒక్కొక్కటిగా పీకుతోంది టాలీవుడ్. ఇక బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు. అక్కడి కథలు కూడా పెద్దగా బాగుండటం లేదనే మాట ఉంది. ఈ నేపధ్యంలో… టాలీవుడ్ పై తమిళ సినిమా పరిశ్రమపై పడుతోంది బాలీవుడ్. ఇప్పుడు దేవర ఊహించని హిట్ కొట్టడం, భారీ వసూళ్లు సాధించడంతో బాలీవుడ్ ముక్కున వేలేసుకుంటుంది అనే చెప్పాలి. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు దేవర ఇంటికి క్యూ కడుతున్నారు.
అప్పుడప్పుడు తెలుగు సినిమాల వైపు చూసే అక్కడి అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోవద్దని భావిస్తున్నాడు. వెట్రిమారన్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాను తాను నిర్మిస్తా అని ముందుకు వస్తున్నాడు కరణ్ జోహార్. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి అడగడానికి రెడీ అయ్యాడు. వచ్చే వారం దసరా సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఇంటికి రానున్నాడు కరణ్ జోహార్. హిందీలో కూడా దేవర ప్రభావం గట్టిగా ఉండటంతో… హిందీ హక్కులతో పాటు నిర్మాతగా కూడా వెట్రిమారన్ సినిమాకు వ్యవహరిస్తా అని అడిగేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు ఫోన్ చేసినట్టు సమాచారం.