Suriya-Jyothika: సూర్య, జ్యోతిక విడిపోతున్నారా.. కార్తి ఏం చెప్పారంటే..!

తన అన్నావదిన సూర్య, జ్యోతిక గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "జ్యోతికను నేనెప్పుడూ వదినలా చూడలేదు. అమ్మలాగే చూశాను. ఆమె కూడా నన్ను వారి పిల్లల్లాగే చూసింది. అమ్మ (జ్యోతిక) ఇంట్లో లేకపోవడంతో సందడి లేదు. ఇల్లంతా బోసిపోయినట్లుంది.

  • Written By:
  • Updated On - September 25, 2023 / 08:49 PM IST

Suriya-Jyothika: కోలీవుడ్‌ సూపర్ స్టార్ సూర్య, ఆయన సతీమణి, నటి జ్యోతిక వేరేవేరుగా ఉంటున్నారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, ఇద్దరూ విడిపోతారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ అంశంపై సూర్య, జ్యోతిక స్పందించలేదు. కానీ, సూర్య సోదరుడు, మరో స్టార్ హీరో కార్తి తాజాగా దీనిపై స్పందించారు.

తన అన్నావదిన సూర్య, జ్యోతిక గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “జ్యోతికను నేనెప్పుడూ వదినలా చూడలేదు. అమ్మలాగే చూశాను. ఆమె కూడా నన్ను వారి పిల్లల్లాగే చూసింది. అమ్మ (జ్యోతిక) ఇంట్లో లేకపోవడంతో సందడి లేదు. ఇల్లంతా బోసిపోయినట్లుంది. ఇన్నాళ్లు మేమంతా కలిసి ఉండటానికి కారణం వదినమ్మ జ్యోతికనే. అయితే, పిల్లల చదువు కోసం తాను ముంబైలో ఉంటోంది. పిల్లలు ఎదుగుతుండటంతో చదువు కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. చదువులు పూర్తయ్యాక తిరిగి వస్తారు. అప్పటి వరకు పండుగలకు కలుస్తూనే ఉన్నాం. మళ్లీ అందరం కలిసి ఉండే రోజు కోసం ఎదురు చూస్తున్నా” అంటూ పోస్ట్ చేశారు. తన వదినమ్మ, పిల్లలు లేని ఇంట్లో ఉండలేకపోతున్నట్లు కార్తి తెలిపారు. కార్తి పోస్ట్ ద్వారా సూర్య, జ్యోతికి విడిపోలేదని స్పష్టమైంది.

పిల్లల చదువుల కోసమే వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతూ స్పందిస్తున్నారు. అయితే, జ్యోతిక పిల్లలతో కలిసి ముంబై వెళ్లిపోవడంతో, కొందరు సూర్య, జ్యోతిక విడిపోయారని నమ్మి, ప్రచారం మొదలెట్టారు. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలు చేసిన జ్యోతిక, సూర్య 2006లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన జ్యోతిక.. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో జ్యోతిక నటిస్తోంది. సూర్య కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.