Aashiqui 3: ఆ హీరో రెండో ప్రేయసి, ఇప్పుడు మూడో ప్రేయసిగా మారిందా..?

ఆషికీ 2 ఒక మ్యూజికల్ మిరాకిల్. మర్చిపోలేని రొమాంటిక్ మెమొరి. అందులో అన్ని పాటలు హిట్టవ్వటం కాదు తూటాల్లా మనసులోతుల్లోకి దూసుకెళ్ళాయి. అలాంటి మూవీకి మూడో సీక్వెల్‌గా ఆషికీ 3 రాబోతోంది. ఈ మూడో జంటలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ సెలెక్ట్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 04:52 PM IST

Aashiqui 3: యానిమల్‌లో రష్మిక కంటే కూడా ఎక్కువగా ఫోకస్ అయిన లేడీ త్రిప్తీ దిమ్రీ. కేవలం ఒక పాట, రెండు మూడు సీన్లలో తను ఆరబోసిన అందాల వల్ల యూత్ మతిపోగొట్టింది. ఇలానే ఇప్పుడో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ మతికూడా పోగొట్టేలా ఉంది. తన మూడో లవర్‌గా తను సెటిలైనపోయినట్టే అని తెలుస్తోంది. ప్రజెంట్ బాలీవుడ్‌లో ఎఫైర్లకు ఢోకా లేదు. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమలు, వాటికి బ్రేకులు కూడా కామనే.

MEGASTAR CHIRANJEEVI: మెగా రచ్చ.. మరోసారి మెగాస్టార్.. ఊర్వశీ చిందులు

ఐతే యానిమల్ లేడీ త్రిప్తి మాత్రం రియల్ లైఫ్‌లో రొమాన్స్ సంగతేమో గాని రీల్ లైఫ్‌లో రొమాంటిక్ కిక్ ఇచ్చేలా ఉంది. కార్తిక్ ఆర్యన్‌‌తో ఆషికీ 3 చేయబోతోంది. ఆషికీ వన్ ఎంత హిట్టైందో 1990లనాటి వాళ్లను అడిగితే తెలుస్తుంది. అయితే ఈ తరం వాళ్లకి మాత్రం ఆషికీ 2 ఒక మ్యూజికల్ మిరాకిల్. మర్చిపోలేని రొమాంటిక్ మెమొరి. అందులో అన్ని పాటలు హిట్టవ్వటం కాదు తూటాల్లా మనసులోతుల్లోకి దూసుకెళ్ళాయి. అలాంటి మూవీకి మూడో సీక్వెల్‌గా ఆషికీ 3 రాబోతోంది. ఈ మూడో జంటలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ సెలెక్ట్ అయ్యింది. హీరోగా కార్తిక్ ఆర్యన్ కన్ఫామ్ అయ్యాడు. అంతేకాదు వీళ్ల మధ్య ప్రేమ కూడా చిగురించిందని అప్పుడే పుకార్లు షురూ అయ్యాయి.

ప్రాజెక్ట్ ఓకే అయిన వెంటనే మీడియా ద్రుష్టిలో లవర్స్‌గా ఫోకస్ అయ్యేందుకు వీళ్లు పార్టీలు, పబ్బులు కలిసి తిరుగుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బాలీవుడ్‌లో ఓ మూవీ ప్రమోషన్ ఈజీగా జరగాలంటే ఈమాత్రం ఎఫైర్‌లో ఫైర్ ఉండాల్సిందే అన్న కామెంట్స్ కూడా పెరిగాయి.