అయితే కొన్ని రోజుల నుంచి కీర్తి విషయంలో ఓ రూమర్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. కీర్తి ఓ అబ్బాయితో లవ్‌లో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని రకరకాల రూమర్స్ వస్తున్నాయి. కొందరైతే మరీ అతి చేస్తూ అబ్బాయి డిటెల్స్, పెళ్లి ముహూర్తాలు కూడా చెప్పేశారు. అయితే ఆ రూమర్స్ అన్నిటికీ కీర్తి తల్లి కొట్టి పారేసింది. అలాంటిదేమీ లేదని చెప్పింది. అయినా రూమర్స్ ఆగకపోవడంతో స్వయంగా కీర్తి సురేష్ మీడియా ముఖంగా తాను ఎవరినీ లవ్ చేయడంలేదని చెప్పింది.
కొన్ని రోజులు అంతా సైలెంట్‌గానే ఉన్నా.. రీసెంట్‌గా మళ్లీ కీర్తి పెళ్లి విషయంలో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. కీర్తి సురేష్ రీసెంట్‌గా తన ఫ్రెండ్ ఫర్హాన్ అనే బిజినెస్ మ్యాన్ బర్త్‌డే పార్టీకి వెళ్లింది. అక్కడ ఫర్హాన్‌తో దిగిన ఫొటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. అంతే.. ఇతనే కీర్తికి కాబోయే భర్త అంటూ మళ్లీ కొత్త రచ్చ మొదలు పెట్టారు కొందరు అత్యుత్సాహపరులు. ఇక లాభం లేదని కీర్తి తండ్రి ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
ఫర్హాన్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. కీర్తి ఫర్హాన్ మధ్య అలాంటి సంబంధమేమీ లేదని చెప్పాడు. కీర్తికి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ఒక వేళ పెళ్లి సంబంధం కుదిరితే తాను స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్తానంటూ సీరియస్ అయ్యారు. నిజం తెలుసుకోకుండా పుట్టిస్తున్న రూమర్స్ వల్ల తమ ఫ్యామిలీ మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నామంటూ చెప్పారు. ఇప్పుడైనా ఈ రూమర్స్ ఆగుతాయా లేదా చూడాలి.