Vijay Dalapathy : రాజకీయ వ్యూహం.. రజనీపై విజయ్ సంచలన కామెంట్స్

దళపతి విజయ్ కు కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అస్సలు వివరించక్కర్లేదు. విజయ్ సినిమా వచ్చిందంటే.. ప్రచార బాధ్యతను వారే తీసుకుంటారు.. మూవీ మేకర్స్ కంటే ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంటారు. అందుకే ప్లాప్ సినిమాలైనా సరే మినిమమ్ వసూళ్లతో బయటపడుతుంటాయి. అంతటి ఆదరణ ఉంది విజయ్ కు అభిమానుల్లో.

దళపతి విజయ్ కు కోలీవుడ్ ( Kollywood ) లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అస్సలు వివరించక్కర్లేదు. విజయ్ సినిమా వచ్చిందంటే.. ప్రచార బాధ్యతను వారే తీసుకుంటారు.. మూవీ మేకర్స్ కంటే ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంటారు. అందుకే ప్లాప్ సినిమాలైనా సరే మినిమమ్ వసూళ్లతో బయటపడుతుంటాయి. అంతటి ఆదరణ ఉంది విజయ్ కు అభిమానుల్లో. విజయ్ కు కూడా ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన సక్సెస్ సంతోషాన్ని ప్రతిసారి అభిమానులతో పంచుకుంటాడు.. అయితే తాజాగా లియో సక్సెస్‌ మీట్ వేదికగా ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.

సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేయొద్దని, ఫ్యూచర్ లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు విజయ్ ( Vijay ). ఒకరకంగా.. ఫ్యూచర్ లో తన రాజకీయ అరంగేట్రం ఉండే అవకాశముందనే హింట్ ను ఇండైరెక్టుగా ఇచ్చాడు. అందుకోసం అందరూ ప్రిపేర్ గా ఉండాలన్నట్టు మాట్లాడాడు. ఇదే సమయంలో ఫ్యాన్ వార్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.‌ ఇక కుందేల వేటకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరిని కూడా పంచుకున్నాడు. అభిమానులు పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలని.. ఆ దిశగా అడుగులు వేయాలని కోరాడు.

( political entry ) రాజకీయాల్లోకి వస్తారా అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నకు కప్ మాత్రమే ముఖ్యం బిగిలు అంటూ ఇంట్రెస్టింగ్ అన్సర్ ఇచ్చాడు విజయ్. తమిళంలో ఒక్కరే ( MGR )  ఎంజీ రామచంద్రన్, ఒక్కరే శివాజీ గణేశన్ ( Shivaji Ganesan ) ఉన్నారని.. అలాగే ఒక్కరే విజయ్ కాంత్, ఒక్కరే ( Rajinikanth ) రజినీకాంత్, ఒక్కరే కమల్ హాసన్ ఉన్నాడని చెప్పిన విజయ్.. దళపతి కూడా ఒక్కడేనని చెప్పుకొచ్చాడు. అభిమానులు రాజు అయితే.. తాను సేవకుడిని అంటూ వివరించాడు. ఓవరాల్ గా విజయ్ స్పీచ్ కోసం ఎదురుచూసిన వారందరికి మాంచి కిక్ ఇచ్చాడు