Kiran Abbavaram: కంగ్రాట్స్ అబ్బవరం.. హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్‌..

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. క్లీన్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అతడికి వరుస ఆఫర్లు వచ్చాయ్. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ కళ్యాణమండపంతో మంచి హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నాడు.

  • Written By:
  • Updated On - March 11, 2024 / 08:22 PM IST

Kiran Abbavaram: పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది. సామాన్యులే కాకుండా.. సెలబ్రిటీలు కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. టాలీవుడ్‌కు కూడా పెళ్లి కళ వచ్చేసింది. ఈ మధ్య హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్ పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు మరో హీరో కూడా.. మూడు ముళ్ల బంధానికి రెడీ అవుతున్నాడు. మరో రెండు రోజుల్లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నాడు. అతనే కిరణ్‌ అబ్బవరం. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం.

Vishwambhara: విజువల్ ట్రీట్.. విశ్వంభరలో త్రిష మరో శ్రీదేవిలా కనిపించనుందా..?

ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిన కిరణ్.. ఆ తర్వాత రాజావారు రాణిగారు అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. క్లీన్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అతడికి వరుస ఆఫర్లు వచ్చాయ్. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ కళ్యాణమండపంతో మంచి హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నాడు. తన ఫస్ట్ మూవీ హీరోయిన్‌ రహస్య గోరఖ్‌నే కిరణ్‌ అబ్బవరం పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజావారు.. రాణిగారులో ఈమె హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ చిత్రం షూటింగ్‌లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్తోంది. అయితే వీరిద్దరూ లవ్‌ బర్డ్స్‌ అంటూ ఎప్పటి నుంచో సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

గతంలో ఓ షోలో రహస్య గురించి అడిగితే.. కిరణ్‌ అబ్బవరం తెగ సిగ్గుపడ్డాడు. అంతకుముందు కిరణ్‌ గృహ ప్రవేశ వేడుకల్లోనూ బ్యూటీ సందడి చేసింది. ఇన్నాళ్లు సీక్రెట్‌గా లవ్‌ చేసుకున్న వీరు.. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. త్వరలోనే పెళ్లి డేట్‌ ప్రకటించనున్నారు. ఈ విషయం తెలిసి వీరిద్దరి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.