Salman Khan: దీనమ్మ జీవితం ఇదేం సినిమా..? బిగ్ షాక్..?

సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ అంటూ పూజా హెగ్డేతో కలిసి చేసిన సినిమా ఓ మహా కళా ఖండం అనేస్తున్నారు. సెంటిమీటరు నోరుని రెండు సెంటీమీటర్లు తెరిచి ఫస్ట్ టైం సల్మాన్ డైలాగ్స్ చెప్పడం వండర్ అనేస్తున్నారు. ఇక కథ గురించి చెప్పడం కంటే, కాటమరాయుడు సినిమా చూసినోల్లు పవన్ ప్లేస్ లో సల్మాన్ ని ఊహించుకోండని చెప్పడం బెటర్. పవన్ ప్లేస్ లో సల్మాన్ ని ఊహించుకోవటం కష్టంగా ఉందా.. అయితే కిసీకా భాయ్ కిసీకా జాన్ చూడటం కూడా అంతే కష్టంగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 07:15 PM IST

వెంకీ ఓవరాక్షన్, పూజా హెగ్డే పిచ్చి డైలాగ్ డెలివరీ, హిందీవోళ్లకి కొత్తగా అనిపిస్తుండొచ్చు కాని, ఇక్కడ మాత్రం పరమ చెత్తగా ఉంతనే రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీ ఆర్ట్ ఫిల్మ్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే 8 పాటల మధ్య కథని నింపటం నిజంగా ఆర్టే కదా అనేది సినిమా చూసిన బాధితుల వాదన.

హిందీ సీరియల్ ఆర్టిస్టులని తీసుకుని తెలంగాణ పాటని, తెలుగు నేపథ్యాన్ని వాడుకుని ఏదో చేయబోయిన దర్శకుడు, కిచిడీ కథతో భయపెట్టేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కి, సినిమా డైరెక్టర్ కి, కథ, కథనాలు రాసిన రైటర్ కిపెద్దగా పనిలేదు. అందుకే జనాలకు చూసే ఓపిక కనిపించట్లేదు

ఇదే వారం వచ్చిన విరూపాక్షది విచిత్రమైన రెస్పాన్స్.. విరూపాక్ష ఆడదు, కాష్మోరాలాంటి పాత కథలు ఇప్పుడు తీస్తే ఎలా అంటూ వచ్చిన నెగెటీవ్ టాక్ కి, ఈ మూవీ షాక్ ఇస్తోంది. ఎందుకంటే, ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్ చేస్తూ సాగే సుకుమార్ కథనం సినిమాకు ప్లస్ అయితే, దర్శకుడి టేకింగ్, సినిమాటోగ్రఫీ దీనికి తోడు మ్యూజిక్ తోపాటు సాయితేజ్, సంయుక్త పెర్ఫామెన్స్ పీక్స్ అంటున్నారు. రియల్లీ 5 పాయింట్స్ కి మూడున్నర పాయింట్లు వచ్చేసినట్టే అనే టాక్ కిక్ ఇస్తోంది.