Kalki 2898 AD : క్లీంకార కి ప్రభాస్ కల్కి కి సంబంధం

రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడి సౌత్ సినీ పరిశ్రమతో పాటు హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం ఇప్పుడు కల్కి కోసం ఎదురుచూస్తుంది. ఆ మాట కొస్తే వరల్డ్ సినీ పరిశ్రమ కూడా ఎదురుచూస్తుందని చెప్పవచ్చు.

రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడి సౌత్ సినీ పరిశ్రమతో పాటు హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం ఇప్పుడు కల్కి కోసం ఎదురుచూస్తుంది. ఆ మాట కొస్తే వరల్డ్ సినీ పరిశ్రమ కూడా ఎదురుచూస్తుందని చెప్పవచ్చు. నిస్సందేహంగా ఎదురుచూస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కల్కి సబ్జెక్టు అలాంటిది మరి. పైగా బాహుబలి తో వరల్డ్ సినిమాకి ఆ అవకాశాన్ని కూడా ప్రభాస్ కల్పించాడు. ఏ రోజుకా రోజు అంచనాలని పెంచుకుంటూ వెళ్తున్న కల్కి గురించి ఉపాసన కొణిదెల చేసిన ఒక పోస్ట్ టూ డే టాక్ అఫ్ ది డే గా నిలిచింది.

కల్కి టీం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన ల ముద్దుల కూతురు క్లీంకార కి కొన్ని బహుమతులని పంపింది. ఇదేంటి చిన్న పాపకి బహుమతి ఇస్తే ఏం చేసుకుంటుందని అనుకుంటున్నారా…కల్కి కేవలం పెద్ద వాళ్లకి మాత్రమే సొంతం కాదు. క్లీంకార లాంటి బుజ్జి పాప లకి కూడా సొంతం. అందుకు నిదర్శనంగా ప్రభాస్ ప్రెజంట్ డార్లింగ్ అయిన బుజ్జి ని గిఫ్ట్ గా ఇచ్చారు. బుజ్జి రూపంతో ఉండే బొమ్మతో పాటు అదే విధంగా భైరవ స్టిక్కర్స్ ని, టీ షర్ట్స్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.ఇప్పుడు క్లీంకార ఎంచక్కా ఆ బొమ్మలతో ఆడుకుంటుంది. తను ఆడుకుంటున్న ఫోటోలని ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. కల్కి టీం కి థాంక్స్ చెప్పడంతో పాటు సినిమా విజయంతం కావాలని కూడా కోరుకుంది. ఇప్పుడు ఈ విషయం నిమిషాల్లో వైరల్ గా మారింది. రికార్డు లెవల్లో వ్యూయర్స్ ని కూడా సంపాదిస్తుంది.

కల్కి టీం చేస్తున్న ఈ వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తుంది. నెస్ట్ ఏ సెలబ్రిటీ పిల్లలకి గిఫ్స్ పంపిస్తారో ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఎన్టీఆర్ పిల్లలనే టాక్ అయితే మాత్రం సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇక కల్కి రిలీజ్ డేట్ జూన్ 27 కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే కొద్దీ అందరిలో కల్కి ఫీవర్ మొదలయ్యింది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే జూన్ 27 తర్వగా రావాలంటే ఏం చెయ్యాలనే ఆలోచనలో పడ్డారు.ప్రభాస్ తో దీపికా పడుకునే జతగా నటిస్తున్నఈ ఫాంటసీ సైంటిఫిక్ కల్కి లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకుడు. మహానటి వచ్చిన ఆరేళ్ళకి అశ్విన్ నుంచి వస్తున్న మూవీ ఇదే.ఆరు వందల కోట్ల బడ్జట్ తో తన వైజయంతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. మార్కెట్ లో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను కూడా విక్రయిస్తున్నారు.