కోలీవుడ్ (Tollywood) స్టార్ (Star Hero) ధనుష్ (Dhanush) నుంచి సినిమా వస్తుందంటే ఆ సినిమా తప్పనిసరిగా మూస పద్దతిలో సాగే సినిమా అవ్వదు అనే నమ్మకం అన్ని భాషలకి సంబంధించిన మూవీ లవర్స్ లోను ఉంది. మరి సంక్రాంతికి తమిళ ప్రేక్షకులని పలకరించిన మిల్లర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరీ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ
బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న కాలంలో కులవివక్ష కారణంగా ఒక గ్రామంలోని అణగారిన వర్గాల ప్రజలని వాళ్ళ యొక్క కుల దైవమైన గోరాహరుడు గుడిలోకి ఆ ఊరి జమీందారులు అనుమతించరు. అదే వర్గానికి చెందిన అగ్నిశ్వర (ధనుష్) సొంత వాళ్ళ కంటే బ్రిటిష్ వాళ్లే నయం అనుకోని బ్రిటిష్ సైనం లో చేరతాడు. ఈ విషయంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడే తన అన్న శివన్న (శివ రాజ్ కుమార్ ) వద్దన్నా కూడా అగ్ని బ్రిటిష్ (British) సైన్యం లో చేరతాడు.
ఇంకో పక్క జమిందారులకి ఇష్టం లేకుండా గుడిలో ఉన్న గోరాహరుడి విగ్రహాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తారు. అలాగే బ్రిటిష్ సైనం మీద కోపంతో బయటకి వచ్చిన అగ్నిశ్వర ఒక దొంగల ముఠాలో చేరి దొంగతనాలు చేస్తుంటాడు. అసలు అగ్ని బ్రిటిష్ సైన్యం నుంచి ఎందుకు బయటకి వచ్చాడు? గోరాహరుడి విగ్రహం యొక్క కథ ఏమయ్యింది?శివన్న లక్ష్యం నెరవేరిందా ? తన గ్రామ ప్రజలని అగ్ని గుడి ప్రవేశం చేయించాడా? అసలు అగ్నిశ్వర కి కెప్టెన్ మిల్లర్ అనే పేరు ఎలా వచ్చిందనేదే మిగతా కథ.
పర్పామెన్స్.. సాంకేతిక విభాగం
ధనుష్ అధ్బుతమైన పెర్ఫార్మ్ ఇచ్చాడు. వన్ మ్యాన్ షో (One Man Show) లా సినిమాను నడిపించాడు. ప్రియాంక మోహన్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ సినిమా ఎందుకు ఒప్పుకుందో ఆమెకే తెలియాలి. శివ రాజ్ కుమార్ కి కూడా ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. సందీప్ కిషన్ కి కూడా చెయ్యడానికి ఏమి లేదు. ఇక మిగతా పాత్రల్లో నటించిన వాళ్ళందరు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ చాలా కష్టపడ్డాడు గాని స్క్రిప్ట్ విషయంలో చేసిన పొరపాట్లు వల్ల అతని దర్శకత్వ ప్రతిభ మసకబారింది. మంచి కథే కదా ఎందుకు కథనం రాంగ్ రూట్ లో వెళ్తుందనే భావన ప్రేక్షకుడికి అనిపిస్తుంటుంది. ప్రతి సీన్ కూడా వెరైటీ గా ఉండాలనే ఉద్దేశంతో కథనం దారి తప్పింది.
ధనుష్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మారటం అనేది ఇంటర్వెల్ బ్లాక్ కి తీసుకుంటే బాగుండేది. అసలు ధనుష్ కి సినిమా మొత్తం చంపడం తప్ప ఇంకేం పని ఉండదు. పైగా ఫస్ట్ ఆఫ్ సో సో గా తీసారేమో సెకండ్ ఆఫ్ బాగుంటుందేమో అని అనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ నయం అనిపిస్తుంది పాటల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఫైట్స్ బాగున్నాయి. సిద్దార్థ్ నూని కెమెరా పని తనం కూడా బాగుంది. ఒవరాల్ గా కెప్టెన్ మిల్లర్ గురించి ఫైనల్ గా చెప్పుకోవాలంటే ధనుష్ మీద నమ్మకంతో సినిమాకి వెళ్తే దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ధనుష్ తో పాటు ప్రేక్షకులని మోసం చేసాడు. తుపాకుల మోతలు తప్ప సినిమాలో ఏమి లేదన్న ఫిలింగ్ కలుగుతుంది