Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో సంచలన నిర్ణయం.. విజయ్ సేతుపతి షాకింగ్ డెసిషన్..

విజయ్ సేతుపతి..సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. క్యారెక్టర్ ఏదైనా కానీ తన నటనతో చెడుగుడు ఆడేస్తాడు. అందుకే సేతుపతికి ఉన్న ఫ్యాన్ బేసేవేరు..అయితే తాజాగా విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కి, మేకర్స్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం..

విజయ్ సేతుపతి..సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. క్యారెక్టర్ ఏదైనా కానీ తన నటనతో చెడుగుడు ఆడేస్తాడు. అందుకే సేతుపతికి ఉన్న ఫ్యాన్ బేసేవేరు..అయితే తాజాగా విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కి, మేకర్స్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం..

హీరోలుగా మాత్రమే కాదు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆడియన్స్ తో ఫుల్ మార్క్స్ వేయించుకున్న అతి కొద్దిమంది నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన విజయ్ సేతుపతి..మెల్లగా హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. తన నటనకు ఫిదా అయిపోయిన దర్శక నిర్మాతలు మెల్లగా తనకు విలన్స్ రోల్స్ కూడా ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. అయితే కొన్నాళ్ల వరకు ఇక విలన్‌గా చేయను అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు సేతుపతి. అందుకు కారణాలు కూడా చెప్పాడు..

Bigg Boss : బిగ్ బాస్ ట్విస్ట్.. కెప్టెన్సీ టాస్క్ రద్దు..

హీరోగా మాత్రమే కాదు..ఏ పాత్ర ఇచ్చినా విజయ్ సేతుపతి స్క్రీన్ ని ఆక్యుపై చేసేస్తాడు. మిగిలిన యాక్టర్స్ ని డామినేట్ చేసేస్తాడు. అయితే విలన్ పాత్రలు చేయడంలో తనకు చిక్కులు తెచ్చిపెడుతోందంటున్నాడు. ఈ మధ్యే గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న విజయ్ సేతుపతి.. తాను ఇకపై విలన్ రోల్స్ చేయనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. విలన్ పాత్రలు చేయడం వల్ల తనకు ఒత్తిడి ఎక్కువవుతోందన్నాడు. హీరోనే స్వయంగా తనను అడగడం నెగిటివ్ రోల్స్ చేయాల్సి వస్తోందన్నాడు కానీ అడిగిన ఆ హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. అయితే విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు నాకేమీ చెడుగా అనిపించడం లేదు కానీ అదే సమయంలో చాలా పరిమితులు ఉంటున్నాయని తన బాధను ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. హీరోకు మించి చేయకూడదు అంటూ కంట్రోల్ చేస్తున్నారు..కష్టపడి చేసిన కొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో కూడా పోతున్నాయని ముక్కుసూటిగా చెప్పేశాడు. అలాంటి క్యారెక్టర్స్ చేయాలా వద్దా అనే అయోమయం ఆందోళన మొదలైంది..అందుకే కొన్నేళ్ల పాటూ విలన్‌లాగా చేయను అని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనకు ఎంత జ్ఞానం ఉన్నా..నలుగురిలో కలిసినప్పుడు అది బయటపడుతుంది. నేను సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నా చుట్టూ చాలామంది మేధావులు ఉండేవారు. కానీ ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నామనే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు తమ నిర్ణయాలను మీ మెదడులోకి ఎక్కిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.