KORATALA SHIVA: కాపీ కథ కేసులో కొరటాలకు సుప్రీం షాక్‌..

కొరటాల శివ దర్శకుడిగా.. శ్రీమంతుడు మూవీ వచ్చింది. ఐతే చచ్చేంత ప్రేమ పేరుతో తాను రాసిన నవల కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి శ్రీమంతుడు పేరుతో సినిమా చేశారని డైరెక్టర్ శివ కొరటాల, నిర్మాతలపై.. శరత్ చంద్ర అనే రచయిత క్రిమినల్ కేసు పెట్టారు.

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 05:18 PM IST

KORATALA SHIVA: ఎన్టీఆర్‌తో దేవర మూవీ తెరకెక్కిస్తున్న డైరెక్టర్‌ కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కాపీరైట్స్ కేసులో.. నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. కొరటాల శివ దర్శకుడిగా.. సూపర్‌స్టార్ మహేష్‌ హీరోగా శ్రీమంతుడు మూవీ వచ్చింది. ఐతే చచ్చేంత ప్రేమ పేరుతో తాను రాసిన నవల కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి శ్రీమంతుడు పేరుతో సినిమా చేశారని డైరెక్టర్ శివ కొరటాల, నిర్మాతలపై.. శరత్ చంద్ర అనే రచయిత క్రిమినల్ కేసు పెట్టారు.

SALAAR 2: సలార్ 2.. ఆ సినిమా కన్నా ముందే.. ప్రశాంత్ నీల్ ప్లాన్ ఇదే..!

అయితే ఆ క్రిమినల్ కేసును సవాల్ చేస్తూ కొరటాల శివ, నిర్మాతలు.. వేరువేరుగా ముందుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాపీ రైట్‌‌ యాక్ట్ కింద డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివ విచారణ ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు గతంలో తేల్చి చెప్పింది. ఐతే మూవీ నిర్మాత ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌పై కాపీ రైట్‌‌యాక్ట్‌‌ కేసు చెల్లదని చెప్పింది. వీళ్లపై ఫోర్జరీ, చీటింగ్‌‌ కేసులు నమోదు చేయాలన్న కథా రచయిత శరత్‌‌ చంద్ర అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు కొరటాల. సుప్రీం కోర్టు కూడా నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పింది.

శ్రీమంతుడు కథలో స్వల్ప మార్పులు ఉన్నాయని.. 8మంది రచయితల కమిటీ చెప్పడంతో డైరెక్టర్‌‌‌‌ కాపీ రైట్‌‌ యాక్ట్‌‌ నిబంధనల ప్రకారం విచారణ ఎదుర్కోవాలని.. దర్శకుడే కథా రచయితకు, స్రీన్‌‌ప్లేకు సొమ్ము చెల్లించారని హైకోర్టు తెలిపింది. స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి తన కథ అంటే కుదరదని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి వ్యవహారాలపై విచారణను ఎదుర్కోవాలని.. ఐతే ఈ వ్యవహారంతో నిర్మాతకు సంబంధం లేదని తెలిపింది కోర్టు.